Japan: ‘జపాన్'(తెలుగు) థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!
November 11, 2023 / 08:19 PM IST
|Follow Us
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ 25వ సినిమాగా ‘జపాన్’ రూపొందింది. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ అధినేతలైన ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు.. లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.జి వి ప్రకాష్ కుమార్ సంగీతంలో రూపొందిన పాటలకి కూడా మంచి స్పందన వచ్చింది అని చెప్పాలి.
అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తుండగా.. కార్తీ గజదొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. సునీల్ కూడా ఈ మూవీలో ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. నవంబర్ 10 న దీపావళి కానుకగా ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఒకసారి ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ను గమనిస్తే :
నైజాం
2.50 cr
సీడెడ్
0.80 cr
ఉత్తరాంధ్ర
0.90 cr
ఈస్ట్+వెస్ట్
0.70 cr
కృష్ణా + గుంటూరు
0.90 cr
నెల్లూరు
0.25 cr
ఏపి+ తెలంగాణ
6.05 cr
‘జపాన్’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ (Japan) బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.6.3 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప టార్గెట్ అంత ఈజీ అయితే కాదు.