“మన తోటలో ఉన్న తులసి మొక్క వైద్యానికి పనికి రాదు” అని ఓ సామెత మాదిరిగా.. మనవాళ్ళ ప్రతిభని మనం గుర్తించం… గుర్తించినా ఆ విషయాన్ని చెప్పము. సిగ్గో.. ఈగో తెలియదు కానీ నచ్చిన విషయాన్నీ వ్యక్తపరచడానికి కూడా వెనకడుగు వేస్తాం. ఈ విషయంలో మాత్రం విదేశీయులను అభినందించాల్సిందే. ఎందుకంటే మన భాషలో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ చిత్రాన్ని వారు ఆదరించారు. అక్కడ వందరోజులు బాహుబలి 2 ప్రదర్శితమైంది. అంతేకాదు వందరోజుల పండుగను వైభవంగా నిర్వహించారు. ఆ వేడుకకు వెళ్లిన రాజమౌళి, శోభు యార్లగడ్డకి ఘన స్వాగతం పలికారు. ఏ లోటు లేకుంటా చూసుకున్నారు.
పైగా ఆ చిత్ర నటీనటులకు అనేక కానుకలను అందించారు. వాటిని చూసి బాహుబలి బృందం సంతోషించింది. తాజాగా ఈ చిత్రంలో కుమారవర్మగా నటించిన సుబ్బురాజుని ఆహ్వానించి ఆశ్చర్యంలోముంచెత్తించారు. వీధుల నిండా బ్యానర్లు, వేదిక నిండా అలంకరణలు, హాలు నిండా అభిమానులు.. సుబ్బరాజుకి హృదయపూర్వక స్వాగతం పలికారు. సుబ్బురాజు కుమారవర్మ వేషధారణలోనే హాజరై వారికి కాసేపు వినోదాన్ని పంచారు. సినిమాలోని కొన్ని డైలాగులు, సీన్లు చేసి చూపించారు. అనేక కానుకలు అందుకున్నారు. ఉత్సవంలా జరిగిన ఈ వేడుకకు సంబంధిన ఫోటోలు నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. జపనీయులు మన నటుడిపై చూపించిన అభిమానం ఎప్పటికీ మరిచిపోలేనివి.