Jathi Ratnalu Collections: 27 కోట్ల పైనే లాభాలను అందించిన ‘రత్నాలు’..!
April 8, 2021 / 08:26 PM IST
|Follow Us
నవీన్ పోలిశెట్టి,ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ‘జాతి రత్నాలు’ చిత్రం మార్చి 11న విడుదలయ్యింది. కె.వి.అనుదీప్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి మొదటి షోతోనే హిట్ టాక్ లభించడంతో.. ముందు నుండీ ఉన్న హైప్ కారణంగా 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి హిట్ లిస్ట్ లోకి చేరింది. ‘స్వప్న సినిమా’ బ్యానర్ పై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. 4 వారాలు పూర్తయినప్పటికీ ఈ చిత్రానికి ఇంకా ఆధరణ దక్కలేదనే చెప్పాలి.
‘జాతి రత్నాలు’ వారాల కలెక్షన్ల వివరాలను ఓ సారి గమనిస్తే :
నైజాం
15.98 cr
సీడెడ్
4.26 cr
ఉత్తరాంధ్ర
3.97 cr
ఈస్ట్
1.92 cr
వెస్ట్
1.52 cr
గుంటూరు
2.09 cr
కృష్ణా
1.84 cr
నెల్లూరు
0.91 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
32.49 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
1.71 cr
ఓవర్సీస్
4.25 cr
వరల్డ్ వైడ్ (టోటల్)
38.45 cr
‘జాతి రత్నాలు’ చిత్రానికి 10.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది కాబట్టి.. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 11.3కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉండగా…ఆ టార్గెట్ ను 3 రోజుల్లోనే కంప్లీట్ చేసి 28 రోజులకు గాను ఏకంగా 38.45 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ చిత్రం కొన్న బయ్యర్లు ఇప్పటివరకూ 27.15 కోట్ల లాభాలను ఆర్జించారు.