జయలలితగా రమ్యకృష్ణ నటనను బీట్ చేయడం ఇక కష్టమే

  • December 18, 2019 / 11:17 AM IST

వెబ్ సిరీస్ లో నటి రమ్యకృష్ణ మరోసారి తన సత్తా చాటింది. బాహుబలి సినిమాలో శివగామిగా ఎంతగా అలరించి ఆకట్టుకుందో ఇప్పుడు క్వీన్ వెబ్ సిరీస్ ద్వారా కూడా అంతే మొత్తంలో అలరిస్తుంది. జయలలిత బయోపిక్ “క్వీన్” వెబ్ సిరీస్ లో రమ్యకృష్ణ చేసిన నటనకు విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. చాలా గంభీరంగా జయలలిత బాడీ లాంగ్వేజ్ ను అనుసరిస్తూ రమ్యకృష్ణ చేసిన నటన ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.

ప్రస్తుతం ఆన్ లైన్ లో స్ట్రీమింగ్ అవుతున్న క్వీన్ సినిమాను జనాలు విపరీతంగా చూస్తున్నారు. బాహుబలి వచ్చిన చాలా ఏళ్లకు మళ్లీ శివగామి స్థాయి పాత్రను రమ్యకృష్ణ చేసింది అంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత బయోపిక్ కు రమ్యకృష్ణ అద్బుతంగా సూట్ అయ్యిందని.. ఈమెతోనే సినిమా చేస్తే బాగుండేదనేది పలువురి అభిప్రాయం. దాంతో ఇప్పుడు “తలైవి” చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్న కంగనాకు ఈ రమ్యకృష్ణ గట్టి పోటీ ఇస్తోంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus