చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డైరెక్టర్, హీరో ‘జయం’ రవి ఈయన కొడుకులే..!
November 17, 2022 / 06:14 PM IST
|Follow Us
ఎడిటర్ మోహన్ నేడు (నవంబర్ 17) తన 50వ వివాహ వార్షికోత్సవాన్ని కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు.. మోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు.. ఎడిటర్ మోహన్ అంటే పేరు కాదు.. బ్రాండ్ అనేలా ఉండేవి ఆయన సినిమాలు.. దాదాపు 200 చిత్రాలకు పైగా ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించిన మోహన్.. తెలుగులో 10, తమిళ్లో 5 సినిమాలు నిర్మించడే కాక.. 60 సినిమాలను తెలుగు నుండి తమిళ్లోకి డబ్ చేశారు..
మహ్మద్ జిన్నా అబ్దుల్ ఖాదర్ నుండి ఎడిటర్ మోహన్‌గా మారడం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటనేది మోహన్ గారికే తెలియాలి.. సినిమా అంటే ఎంతో ప్యాషన్ కలిగిన మోహన్ తర్వాత నిర్మాతగా, రచయితగా కూడా సత్తా చాటారు.. వారికి భార్య వరలక్ష్మీతో ముగ్గురు సంతానం ఉన్నారు. కోలీవుడ్‌లో పెద్ద కొడుకు దర్శకుడిగా, చిన్న కొడుకు హీరోగా రాణిస్తున్నారు..మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ చిత్రాన్ని తీసిన మోహన్ రాజా పెద్ద కొడుకు..
పలు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయస్థుడైన ‘జయం’ రవి రెండో కొడుకు.. కుమార్తె రోజా డెంటిస్ట్.. 50వ పెళ్లిరోజుని పిల్లలు, వాళ్ల పిల్లలతో కలిసి.. తమిళనాడులోని తిరుతని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జరుపుకున్నారాయన.. తల్లిదండ్రుల వెడ్డింగ్ యానివర్సరీ ఫోటోలను రవి షేర్ చేయడంతో.. తమిళ్, తెలుగు సినీ ప్రముఖులు, అభిమానులు వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ మూవీని మొదట తమిళ్లో తన తమ్ముడు హీరోగా తెరకెక్కించారు మోహన్ రాజా.. ‘హనుమాన్ జంక్షన్’ తన ఫస్ట్ ఫిలిం.. నితిన్ ‘జయం’ రీమేక్‌తో హీరోగా పరిచయమైన రవి.. ‘జయం’ రవిగా సెటిలైపోయాడు.. ఎడిటర్ మోహన్.. ఎమ్.ఎల్.ఆర్ట్ మూవీస్ బ్యానర్ మీద ‘మామగారు’, ‘బావ బావ మరిది’, ‘హిట్లర్’, ‘మనసిచ్చి చూడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ లాంటి సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు..