Jayasudha: ఆ విషయం వాల్లేనా చెప్పు తో కొట్టిందా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

  • May 15, 2023 / 12:28 PM IST

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ హీరోలందరితో కలిసి నటించి, అగ్ర కథానాయికగా దశాబ్దం కి పైగా ఒక వెలుగు వెలిగింది జయసుధ. చిరంజీవి , కృష్ణ, ఎన్టీఆర్ , శోభన్ బాబు , ఏ ఎన్ ఆర్ ,కృష్ణం రాజు ఇలా ఎంతో మందితో నటించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. అయితే ఒక వయస్సు వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ కి అయినా ఆఫర్లు తగ్గిపోవడం అనేది సర్వసాధారణం, అలా జయసుధ విషయం లో కూడా జరిగింది.

వయసు పెరిగే కొద్దీ ఆమెకి హీరోయిన్ రోల్స్ దూరం అవుతూ వచ్చాయి. ఆ సమయం లో ఆమె క్యారక్టర్ ఆర్టిస్టుగా మారి,తన కెరీర్ ని ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉంది. ముఖ్యంగా తల్లి పాత్రలకు ఆమె రోల్ మోడల్ లాంటిది అని చెప్పాలి. అందుకే ఆమెని ఇండస్ట్రీ లో అందరూ సహజనటి అంటుంటారు. ఇది ఇలా ఉండగా గతం లో ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఒక ప్రముఖ స్టార్ హీరోయిన్ తో జరిగిన గొడవ గురించి చెప్పుకొచ్చింది.

ఆమె మాట్లాడుతూ ‘ దాసరి నారాయణ రావు దర్శకత్వం లో కృష్ణం రాజు హీరోగా ‘కటకటాల రుద్రయ్య’ సినిమా చేస్తున్నాం, ఇందులో నేను హీరోయిన్ గా నటించాను, నాతో పాటు జయచిత్ర కూడా మరో హీరోయిన్ గా నటించింది, అయితే మా ఇద్దరి కి చెప్పుల విషయం లో గొడవ జరిగింది. నేను చాలా హై హీల్స్ వాడేదానిని. ఆ చెప్పులు వేసుకొని ఆ అమ్మాయి ముందుకు వస్తే నచ్చేది కాదు, ఆ చెప్పులు ఇప్పేసి రా అని నాకు చెప్పింది.

నేను (Jayasudha) ఎందుకు విప్పాలి అని కోపం తో పక్కకి వెళ్లాను. ఇదంతా ఆమె మనసులో పెట్టుకుంది, ఈ సినిమాలో నేను జయచిత్ర బాగా కొట్టుకునే సన్నివేశం ఒకటి ఉంటుంది. ఆ అమ్మాయి నన్ను గట్టిగ కొట్టింది, నేను కూడా చెప్పు తీసుకొని కొట్టాను, అలా ఇద్దరం కొట్టుకుంటూనే ఉన్నాం, ఆ సన్నివేశం బాగా పండింది’ అని జయసుధ మాట్లాడింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus