Jd Chakravarthy: ఆయన నో అనేసరికి వంశీ వెళ్ళిపోయాడు… జేడీ చక్రవర్తి కామెంట్స్!
July 18, 2023 / 09:44 PM IST
|Follow Us
జేడీ చక్రవర్తి అంటే ముందుగా గుర్తొచ్చేది గడ్డం… ఆ తర్వాత ‘గులాబి’. అంతలా ఆ రెండూ ఆయనకు పర్యాయ పదాలు అయిపోయాయి. అయితే అలాంటి సినిమాకు తొలుత హీరోగా అనుకున్నది ఆయనను కాదంటే నమ్ముతారా? కానీ మీరు నమ్మక తప్పదు ఎందుకంటే ఈ విషయం చెప్పింది ఎవరో కాదు జేడీ చక్రవర్తినే. ఇటీవల ఓ వెబ్‌సిరీస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. అంతేకాదు ఆ తొలి హీరో ఎవరు అనే విషయం కూడా చెప్పేశారు. దీంతో ఇప్పుడు ఇప్పుడు జేడీ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పవన్ సాధినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో ‘దయా’ అనే వెబ్ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ‘గులాబి’ సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చాడు జేడీ. ఈ కార్యక్రమానికి జేడీ స్నేహితులు దర్శకుడు కృష్ణవంశీ, ఉత్తేజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి తన సినిమా కెరీర్ గురించి మాట్లాడాడు. కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ వారిద్దరి మొదటి సినిమా ‘గులాబీ’ విషయాలు చెప్పాడు. అందులో భాగంగానే హీరో టాపిక్ వచ్చింది.
పవన్ సాధినేనికు ఇప్పుడు ఈ సిరీస్ చేసే ఛాన్స్ రావడానికి కారణం ‘గులాబీ’ సినిమా అని జేడీ చక్రవర్తి చెప్పాడు. ఆ సినిమా లేకపోతే తాను ఇక్కడ ఉండేవాణ్ని కాదని అసలు రీజన్ చెప్పాడు. 25 ఏళ్ల తర్వాత మళ్లీ నేను, కృష్ణవంశీ ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం ఆనందంగా ఉందని, పవన్ వల్లే ఇది సాధ్యమైందన్నాడు. తానీ స్థాయిలో ఉన్నానంటే దానికి కృష్ణ వంశీనే కారణమని కూడా చెప్పాడు. అయితే తొలుత కృష్ణ వంశీను ‘గులాబీ’ కథతో హీరో రాజశేఖర్ దగ్గరకు తీసుకెళ్లానని ఆ రోజుల గురించి వివరించే ప్రయత్నం చేశాడు.
రాజశేఖర్ దగ్గరకు వెళ్లాక కృష్ణవంశీ ‘గులాబీ’ కథ చెప్పకుండా వేరే కథ చెప్పాడని, మధ్యలో తాను కలుగజేసుకుంటే అప్పుడు మళ్లీ ‘గులాబీ’ కథ స్టార్ట్ చేశాడని వివరించాడు. ఆ సినిమాలో బ్రహ్మాజీ పాత్రను రాజశేఖర్ చేయాలనేది కృష్ణవంశీ ఆలోచనని, కానీ ఆయన అలా అనకుండా… నా పాత్ర చేస్తానన్నారు. దీంతో వంశీ వెంటనే లేచి అక్కడ నుండి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత అలా ఎందుకు చేశావ్ అని అడిగితే ‘గులాబీ’ సినిమా తీస్తే అది జేడీతోనే తీస్తా’ అని వంశీ చెప్పారట. అలాగే నాతోనే చేశాడు అని జేడీ (Jd Chakravarthy) వివరించారు.