Prabhas: ప్రభాస్ పై అసూయా రోజు రోజుకీ పెరుగుతుందిగా..!

  • April 20, 2022 / 06:28 PM IST

‘బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ ‘సాహో’ తో పాన్ ఇండియా స్టార్ అని ప్రూవ్ చేసుకున్నాడు. కానీ తర్వాత వచ్చిన ‘రాధే శ్యామ్’ ప్రభాస్ కు చేదు ఫలితాన్ని ఇచ్చింది. ఇది ఓ మేజికల్ లవ్ స్టోరీ. ప్రభాస్ ను ఆశించే ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో ఉండవు. నిజానికి ఈ మూవీకి ‘సాహో’ కంటే మంచి టాక్ వచ్చింది. కేవలం ప్రభాస్ ఇమేజ్ కు మ్యాచ్ అవ్వలేదని చాలా మంది ప్రేక్షకులు ఈ మూవీని చూడ్డానికి థియేటర్లకు రాలేదు.

Click Here To Watch NOW

దాంతో బయ్యర్స్ కు భారీ నష్టాలు వాటిల్లాయి. ఇదిలా ఉండగా.. సినిమా ఎలా ఉన్నా.. ఈ మూవీలో ప్రభాస్ లుక్స్ పై కూడా చాలా మంది విమర్శలు గుప్పించారు. ప్రభాస్ చాలా ఘోరంగా షేపౌట్ అయ్యాడని, అతన్ని సన్నగా చూపించడానికి చాలా చోట్ల గ్రాఫిక్స్ ను వాడారని చాలామంది ట్రోల్ చేశారు. ఇదిలా ఉండగా.. గత రెండు మూడు రోజులుగా ఏం జరిగిందో తెలీదు నార్త్ లో చాలా మంది ప్రేక్షకులు ప్రభాస్ ను తిట్టిపోస్తున్నారు.

ముఖ్యంగా ప్రభాస్ లుక్ ను అక్కడి వడాపావ్ వంటి పదార్ధాలతో పోల్చి విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్లో ప్రభాస్ కు స్టార్ ఇమేజ్ ఉంది. ‘రాధే శ్యామ్’ ను పక్కన పెడితే అంతకు ముందు వచ్చిన ‘సాహో’ చిత్రం అక్కడ ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కడ ప్రభాస్ కు నెలకొన్న స్టార్ డంని చూసి తట్టుకోలేక.. అసూయతో,కడుపుమంటతో ఇలా విమర్శలు చేసేవారు ఉన్నారనేది ఇన్సైడ్ టాక్. ఇక ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ ‘సలార్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే మారుతీ దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్నట్టు ప్రకటించాడు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus