జాతీయ పురస్కారాలపై ‘జెర్సీ’ డైరక్టర్‌ కామెంట్‌

  • March 23, 2021 / 11:45 AM IST

జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ‘జెర్సీ’కి రెండు పురస్కారాలు వచ్చిన విషయం తెలిసిందే. ఉత్తమ చిత్రం (తెలుగు), ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో పురస్కారాలు దక్కించుకుంది. దీంతో టాలీవుడ్‌లో సందడి వాతావరణం నెలకొంది. చిత్రబృందం కూడా ఆనందం వ్యక్తం చేసింది. అయితే ఇంకో పురస్కారం దక్కి ఉంటే బాగుండేది అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు చిత్ర దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి. అదే ఉత్తమ నటుడు పురస్కారం. దీని గురించే గౌతమ్‌ మాట్లాడారు.

‘జెర్సీ’ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ మాట్లడుకునే అతి కొన్ని అంశాల్లో నాని నటన ఒకటి. సినిమా ఆద్యంతం నాని… అద్భుతమైన నటనతో మెప్పించాడు. కొడుకు, భార్యతో వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్‌ సన్నివేశాలు లాంటివి సినిమాకు చాలా హైలైట్‌గా నిలిచాయి. దీంతో ఈ సినిమాకు, నానికి పురస్కారాల పంట పండుతుంది అని అందరూ అనుకున్నారు. అయితే సినిమాకు పురస్కారం వచ్చింది. నానికి రాలేదు. ఇప్పుడదే మాట దర్శకుడు అన్నారు. సినిమా జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం గురించి కూడా స్పందించారు.

‘‘తెలుగు నుంచి మంచి సినిమాలు వస్తున్నాయి. వాటిలో మా ‘జెర్సీ’ విజేతగా నిలవడం ఆనందం. జాతీయ ఉత్తమ చిత్రంగా పురస్కారం రాలేదనే అసంతృప్తి లేదు. అయితే ఉత్తమ నటుడిగా నానికి ఈ సినిమాతో పురస్కారం వస్తుందనుకున్నా. రావాల్సింది కూడా. అదొక్కటి వచ్చుంటే ‘జెర్సీ’ పరిపూర్ణం అయ్యేది’’ అని అన్నాడు గౌతమ్‌. నవీన్‌ నూలి గురించి మాట్లాడుతూ ‘‘జెర్సీ’కి ఎడిటింగ్‌ విభాగంలో నవీన్‌ నూలికి జాతీయ పురస్కారం రావడం వచ్చింది. ఆయన మంచి ఎడిటర్‌. సినిమాపైనా, సన్నివేశాలపైనా మంచి పట్టు ఉంటుంది. జాతీయ పురస్కారానికి అతను అర్హుడు’’ అని అన్నారు గౌతమ్‌ తిన్ననూరి.

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus