Nithin, Nikhil: జేపీ నడ్డా నితిన్ ను కలవడం వెనుక అసలు కథ ఇదే!

  • September 7, 2022 / 05:51 PM IST

టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలలో ఒకరైన నితిన్ కు ఈ మధ్య కాలంలో టైమ్ అస్సలు బాలేదనే సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కి గత నెలలో విడుదలైన మాచర్ల నియోజకవర్గం సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించగా మాస్ ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఉండేలా నితిన్ జాగ్రత్తలు తీసుకున్నా ఈ సినిమాతో ఆయనకు మరో షాక్ తప్పలేదు.

బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా తాజాగా నితిన్ ను కలిసిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ప్రస్తుతం నితిన్ కెరీర్ ఆశాజనకంగా లేదు. అదే సమయంలో నితిన్ రాజకీయాల్లో కూడా లేడు. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో జేపీ నడ్డా నిఖిల్ ను కలిసి కార్తికేయ2 సినిమా విషయంలో అభినందించాలని అనుకున్నారని అయితే నితిన్, నిఖిల్ పేర్ల మొదటి అక్షరాలు ఒకటే కావడంతో బీజేపీ నేతలు కన్ఫ్యూజ్ అయ్యారని వార్త ప్రచారంలోకి వచ్చింది.

కార్తికేయ2 సినిమా నిర్మాతలలో ఒకరైన అభిషేక్ అగర్వాల్ బీజేపీకి సన్నిహితులు కావడం కూడా ఇందుకు సంబంధించి అనుమానాలు వ్యక్తం కావడానికి కారణమైంది. త్వరలో బీజేపీ నేతలు నిఖిల్ ను కలిసి కార్తికేయ2 సక్సెస్ విషయంలో ఆయనను అభినందించనున్నారని తెలుస్తోంది. అయితే తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం జేపీ నడ్డా నితిన్ ను కలవాలని వచ్చారని నితిన్ నే కలిశారని చెబుతున్నారు.

అయితే నితిన్ ను ఆయన కలవడానికి కారణమేంటనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకడం లేదు. మునుగోడు ఉపఎన్నికను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వల్ల వరుసగా సినీ సెలబ్రిటీలను కలుస్తూ ఆయా హీరోల అభిమానులకు దగ్గర కావాలని బీజేపీ భావిస్తోంది. అయితే బీజేపీ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాల్సి ఉంది. నిఖిల్ కు కార్తికేయ2 సక్సెస్ ప్లస్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా గురించి జోరుగా చర్చ జరుగుతుండటం గమనార్హం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus