Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ గుర్తు చేసిన ‘ఆది’ సినిమాలోని ఆ డైలాగ్ ఏదంటే..!

  • February 7, 2023 / 10:53 AM IST

ఒకసారి నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్ గమనిస్తే.. అటు హీరోగానూ, ఇటు నిర్మాతగానూ విభిన్నమైన చిత్రాలు చేసి సక్సెస్ అందుకున్న ట్రాక్ రికార్డ్ ఉంది. అలాగే కొత్త టాలెంట్‌ని ప్రొత్సహించడంలో కూడా ఆయన ముందుంటాడు.. ఇప్పుడు ‘అమిగోస్’ సినిమాతో రాజేంద్ర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.. తమ్ముడితో ‘జనతా గ్యారేజ్’, బాబాయ్‌తో ‘వీర సింహా రెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఫిబ్రవరి 10న చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది.

ఈ మూవీతో ఆషిక రంగనాథ్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. కళ్యాణ్ రామ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. ఇటీవల రిలీజ్ ప్రోమోల్లో.. ఒకరికొకరు సంబంధం లేని, ఒకేలా ఉండే ముగ్గురు వ్యక్తులు ఎలా కలిశారు?.. కలిశాక వారి జీవితాల్లో ఏం జరిగిందనే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌‌తో ‘అమిగోస్’ ఉండబోతుందంటూ అంచనాలు పెంచేశారు టీమ్. ‘పటాస్’ లో బాలయ్య ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లోని ‘అరే ఓ సాంబ’ సాంగ్ రీమిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టిన కళ్యాణ్ రామ్ ఇప్పుడు ‘అమిగోస్’ కోసం ‘ధర్మక్షేత్రం’ లోని ఎవర్ గ్రీన్ సాంగ్ ‘ఎన్నోరాత్రులొస్తాయి గానీ’ పాటను వాడుకున్నాడు..

ఆదివారం (ఫిబ్రవరి 5) న ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించారు. ‘బింబిసార’ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ తమ్ముడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న కోసం అతిథిగా వచ్చాడు. ఫంక్షన్ ఆద్యంతం ఈ నందమూరి బ్రదర్స్ హైలెట్ అయ్యారు. ఇక ఈ సందర్భంగా తారక్ మాట్లాడే ముందు యాంకర్ సుమ NTR 30 అప్‌డేట్ కోసం అడగ్గా.. కాస్త సీరియస్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. అభిమానులకు సున్నితంగా హెచ్చరిక చేశాడు..

తనకే కాదు, ప్రతి హీరో సినిమాకీ అప్‌డేట్ ఇవ్వమంటూ ఇబ్బంది పెడుతున్నారు.. ఏదైనా అప్‌డేట్ ఉంటే మేమే చెప్తాం.. మా ఇంట్లో భార్యలకంటే ముందుగా మీకే చెప్తాం అంటూ ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. ఇక ఈ మాట తారక్ బ్లాక్ బస్టర్ ఫిలిం ‘ఆది’ లోనూ చెప్పాడంటూ నందమూరి అభిమానులు పోస్టులు చేస్తున్నారు.‘ఆది’ లో హీరోయిన్ అలిగితే.. ఆమెకు అన్నం తినిపించడానికి వెళ్లినప్పుడు..

‘మీ అమ్మా నాన్నల్ని చంపింది మా నాన్నేనని నాకు ఎందుకు చెప్పలేదు?’ అని అడిగితే.. ఎన్టీఆర్.. ‘బయట విషయాలు భార్యలతో డిస్కస్ చేసే అలవాటు మాకు లేదు’ అంటాడు.. అలాగే అప్‌డేట్ విషయానికొస్తే.. మా భార్యలకంటే ముందు మీకు చెప్తాం అన్నాడు. ఇక్కడ భార్య బిడ్డలతో హాయిగా గడపాల్సిన పర్సనల్ లైఫ్‌లో అప్‌డేట్స్ వంటి ప్రొఫెషనల్ విషయాలెందుకు అనుకునే ఇలా చెప్పుకొచ్చాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్..

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus