ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్.ఆర్’ అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతున్న ఎన్టీఆర్ మరోపక్క జెమినీ టీవీలో ప్రసారమయ్యే ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే షోని హోస్ట్ చేయడానికి కూడా రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు ‘బిగ్ బాస్’ రియాలిటీ షోని మొదటిగా హోస్ట్ చేసింది కూడా ఎన్టీఆరే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ విధంగా వెండితెర పైనే కాకుండా బుల్లితెర పై ఎన్టీఆర్ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే బుల్లితెర పై ఓ సీరియల్ లో నటించాడట. బహుశా ఈ విషయం ఎక్కువ మందికి తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఎన్టీఆర్ నటించిన సీరియల్ ఏంటి? ఏ ఛానల్ లో ఆ సీరియల్లో టెలికాస్ట్ అయ్యేది అనే వివరాలను తెలుసుకుందాం రండి. ‘భక్త మార్కండేయ’ అనే పేరుతో అప్పట్లో ఓ సీరియల్ టెలికాస్ట్ అయ్యేది.ఈటీవీలో ప్రసారమయ్యే ఈ సీరియల్ లో లీడ్ రోల్ అయిన మార్కండేయ పాత్రని ఎన్టీఆర్ పోషించాడు.
శివుడి భక్తుడిగా చిన్న వయసులోనే చాలా అద్భుతంగా ఆ పాత్రని పోషించాడు ఎన్టీఆర్. అటు తర్వాత గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’ లో ఎన్టీఆర్… శ్రీరాముని పాత్రని పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఫైనల్ గా ‘ఉషాకిరణ్ మూవీస్’ వారు తెరకెక్కించిన ‘నిన్ను చూడాలని’ చిత్రంతోనే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్.