కళ్యాణ్ రామ్ ను వెనుక నుండీ నడిపిస్తుంది తమ్ముడేనంట..!

  • March 1, 2019 / 03:41 PM IST

నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా చాలా చిత్రాలు తెరకెక్కించాడు. అయితే ఇందులో ‘అతనొక్కడే’ ‘పటాస్’ తప్ప మరే చిత్రాలూ కూడా లాభాలు తెచ్చిపెట్టలేదు. కానీ మంచి టేస్ట్ ఉన్న నటుడిగానూ, నిర్మాతగానూ మాత్రం గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏదైనా కథ కళ్యాణ్ కి నచ్చిందంటే చాలు వేరే నిర్మాత కోసం ఎదురుచూడకుండా తనే సొంతంగా నిర్మించేస్తాడు. అలా చాలా వరకూ నష్టపోయాడు. ఓ దశలో చాలా అప్పుల పాలయిపోయిన తరుణంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ తో ‘జై లవకుశ’ చేసి అప్పులు కొన్ని తీర్చుకున్నాడు. ఇక ఆ తర్వాత నిర్మాణం జోలికి పోలేదు.

తనకి హీరోగా మంచి గుర్తింపు ఎలాగూ ఉంది కాబట్టి తనకి రెమ్యూనరేషన్ కూడా బాగానే లభిస్తుంది కనుక రిస్కు లేకుండా కేవలం హీరోగా మాత్రమే కొనసాగుతున్నాడు. కొన్నాళ్ళ పాటూ నిర్మాణానికి దూరంగా వుండమని ఎన్టీఆరే ఈ సలహా ఇచ్చాడట. దీంతో వెబ్ సిరీస్ లు నిర్మించే పనిలో ఉన్నాడట కళ్యాణ్ రామ్. తన తమ్ముడి సలహాతో కళ్యాణ్‌రామ్‌ వరుసగా బయటి నిర్మాతలకి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. రెమ్యూనరేషన్ తో పాటూ హిందీ డబ్బింగ్ రైట్స్ రూపంలో కూడా కొంత భాగాన్ని తీసుకుంటూ కళ్యాణ్‌రామ్‌ బాగానే రాబడుతున్నాడని సమాచారం. ఇక తాజాగా విడుదలైన ‘118’ చిత్రానికి కూడా మంచి టాక్ ని సొంతం చేసుకుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus