Jr NTR, Mahesh Babu: యూట్యూబ్ లో మహేష్, తారక్ డామినేషన్.. ఏం జరిగిందంటే?
January 10, 2024 / 03:55 PM IST
|Follow Us
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో యూట్యూబ్ వ్యూస్ ఆధారంగా ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. దేవర సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమా తెలుగు వెర్షన్ గ్లింప్స్ కు 24 గంటల్లో ఏకంగా 26.17 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయో చెప్పడానికి ఈ వ్యూస్ సాక్ష్యమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేవర మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో గుంటూరు కారం ఉంది. ఈ మూవీ గ్లింప్స్ కు 20.98 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్ లో మహేష్, తారక్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2, లైగర్, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, ప్రాజెక్ట్ కే, భీమ్లా నాయక్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. దేవర, గుంటూరు కారం కలెక్షన్ల విషయంలో సైతం మ్యాజిక్ చేస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం.
గుంటూరు కారం మూవీ మరికొన్ని గంటల్లో రిలీజ్ కానుండగా ఏపీలో ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. టికెట్ రేట్ల పెంపు గురించి స్పష్టత వచ్చిన తర్వాతే ఈ సినిమా బుకింగ్స్ మొదలయ్యే అవకాశం అయితే ఉండనుందని తెలుస్తోంది. దేవర సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గుంటూరు కారం మూవీ దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ హక్కులు 100 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. గుంటూరు కారం అంచనాలకు మించి రెస్పాన్స్ అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.