యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్లలో భాగంగా కొరటాల శివ సినిమా గురించి మినహా మరే సినిమా గురించి వెల్లడించలేదు. ఈ సినిమాకు ఎన్టీఆర్ 70 రోజుల డేట్స్ కేటాయించారని 55 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మరోవైపు కేజీఎఫ్2 ప్రమోషన్లలో భాగంగా ప్రశాంత్ నీల్ తారక్ కు కథ చెప్పానని తారక్ కు కథ ఎంతగానో నచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ రెండు ప్రాజెక్టులు దాదాపుగా కన్ఫామ్ అయినట్టేనని చెప్పవచ్చు.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ తెరకెక్కుతుండగా వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ అయితే ఉందని సమాచారం అందుతోంది. అయితే ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబో మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రావడం లేదు. కథ నచ్చినా ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన చేయడంలో ఎన్టీఆర్ వెనుకడుగు వేస్తున్నారు. ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో సినిమా అయితే ఉంటుందని
అయితే ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం సులువు కాదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు తారక్ ప్రస్తుతం కెరీర్ విషయంలో రిస్క్ తీసుకోవడానికి అస్సలు ఇష్టపడటం లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఆగిపోవడానికి ఇది కూడా ఒక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్ మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కటం లేదు. ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించే సత్తా ఉన్న బాలీవుడ్ డైరెక్టర్లపై కూడా దృష్టి పెడుతున్నారు.
టెంపర్ సినిమా నుంచి ప్రతి సినిమా విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న ఎన్టీఆర్ వరుసగా ఆరు హిట్లతో డబుల్ హ్యాట్రిక్ సాధించగా తర్వాత సినిమాలతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఎన్టీఆర్ భవిష్యత్తు సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!