పవన్, మహేష్ వద్దనుకున్నది.. ఎన్టీఆర్ చేస్తాడా?

  • January 4, 2020 / 07:22 PM IST

సాధారణంగా తెలుగు స్టార్ హీరోలు గుండుతో కనిపించడానికి ఎక్కువ సాహసం చెయ్యరు. ఎందుకంటే వారి అభిమానులు దానిని జీర్ణించుకోలేరు. గతంలో ‘గజిని’ చిత్రాన్ని అందుకే వదిలేసాను అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓ ఇంటర్వ్యూలో నేరుగా చెప్పారు. ఇక ’24’ చిత్రం చేసే అవకాశాన్ని కూడా మహేష్ బాబు అందుకే తిరస్కరించాడు అని కూడా అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మన ఎన్టీఆర్.. గుండుతో కనిపించే సాహసం చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం.

అందుతోన్న సమాచారం ప్రకారం ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రంలో కొన్ని నిమిషాలు పాటు ఎన్టీఆర్.. గుండుతో కనిపించబోతున్నాడు అనే వార్త ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. రాజమౌళి దర్శకుడు కాబట్టి.. ఎన్టీఆర్ ఎంత రిస్క్ అయినా చేయడానికి రెడీగా ఉంటాడు. ఎందుకంటే ఎన్టీఆర్ కి ‘స్టూడెంట్ నెంబర్ 1’ చిత్రంతో మొదటి హిట్ ఇచ్చింది రాజమౌళి.. ‘సింహాద్రి’ తో పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చింది రాజమౌళి. ఇక వరుస ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్నప్పుడు.. ‘యమదొంగ’ తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కించింది రాజమౌళి. కాబట్టి రాజమౌళి చేస్తున్న ఈ ప్రయోగాత్మక సినిమా కోసం ఎన్టీఆర్ వెనుకడుగు వేయడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ .. కొమరం భీం పాత్ర పోషిస్తున్నాడు.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus