Jr NTR: సినిమాల విషయంలో లక్ష్మీ ప్రణతి సలహాలు.. ఆమె వల్లే మారానంటూ?
March 12, 2024 / 12:48 PM IST
|Follow Us
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) లక్ష్మీ ప్రణతి జోడీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావడంలో లక్ష్మీప్రణతి పాత్ర ఉందని చాలామంది భావిస్తారు. తాజాగా ఒక సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ భార్య గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు. బాల్యంలో నేను హైపర్ మ్యాన్ అని పెళ్లి తర్వాత నేను హోమ్లీ మ్యాన్ గా మారానని ఎన్టీఆర్ కామెంట్లు చేయడం గమనార్హం.. సినిమాల ఎంపికలో నాకు భార్య ఎన్నో సలహాలు ఇస్తుందని తారక్ వెల్లడించారు.
ఈ తరం యువత ఎలాంటి సినిమాలను ఇష్టపడతారో లక్ష్మీ ప్రణతి చెబుతుందని ఆయన అన్నారు. భార్య ఇచ్చిన సలహాల వల్ల నేను మంచి పాత్రలను ఎంచుకోవడంతో పాటు మరింత నటిస్తున్నానని జూనియర్ ఎన్టీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. నేను నేనుగా ఉండేలా నా భార్య ప్రోత్సహిస్తుందని తారక్ చెప్పుకొచ్చారు. నా భార్య మానసికంగా నాకంటే స్ట్రాంగ్ అని జూనియర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు.
నా భార్య ఫిట్ నెస్ బడ్డీ అని నేను వ్యాయామం మానకుండా నా భార్య నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తుందని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కామెంట్లు చేశారు. నా భార్యకు కొత్త సినిమాలు అంటే ఎంతో ఇష్టమని తారక్ పేర్కొన్నారు. భార్య గురించి తారక్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ (Devara) దేవర సినిమాతో ఫ్యాన్స్ ను ఏ రేంజ్ లో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.
ఈ సినిమా రిలీజ్ కు మరో ఆరు నెలల సమయం ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే ఎన్టీఆర్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) కాంబోలో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది. దేవర సినిమా టీజర్ మే నెల 20వ తేదీన విడుదల కానుండగా ఈ టీజర్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.