జూనియర్ ఎన్టీఆర్ డ్రెస్, క్యాప్, వాచ్, సన్ గ్లాసెస్ రేటు ఎంతో తెలుసా!
January 11, 2023 / 07:36 PM IST
|Follow Us
సాధారణంగా సెలబ్రిటీల లైఫ్ స్టైల్, లగ్జీరియస్ గాడ్జెట్స్, వాడే మొబైల్స్, పెట్స్, కార్స్.. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. గతంలోనూ పలుమార్లు ఎన్టీఆర్ టీషర్ట్, స్వెట్‌షర్ట్, షూస్, మాస్క్ కాస్ట్ గురించి వంటి వాటి ధరల గురించిన వార్తలు వైరల్ అవడం చూశాం.. తాజాగా తారక్ ధరించిన ఓ స్టైలిష్ హుడీ ప్రైజ్‌కి సంబంధించిన వార్తతో సోషల్ మీడియాలో సందడి చేశారు..
నందమూరి అభిమానులతో పాటు ఈ జనరేషన్ యూత్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి ఏ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో కొత్తగా చెప్పక్కర్లేదు. తారక్ సినిమాల గురించి, ఫ్యామిలీ, ముఖ్యంగా కిడ్స్ అభయ్ రామ్, భార్గవ రామ్ గురించి ఏ చిన్న న్యూస్ వచ్చినా, పిక్ లేదా వీడియో కనిపించినా దాన్ని ఎంతలా వైరల్ చేస్తారో.. ట్రెండ్ చేస్తారో తెలిసిందే.. 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనడానికి యంగ్ టైగర్ యూఎస్ వెళ్లిన సంగతి తెలిసిందే..
అక్కడ క్షణం తీరిక లేకుండా ప్రమోషన్స్, ఇంటర్వూలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు.. స్టైలిష్ కాస్ట్యూమ్స్‌తో డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. భార్యతో కలిసి ఉన్న పిక్స్, బ్లాక్ సూట్లో స్టైలిష్‌గా కనిపిస్తున్న వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందు తారక్ లగ్జరీ లైఫ్ స్టైల్.. (ఇంటి దగ్గరి నుండి వాచెస్, కార్స్ అండ్ బైక్స్) వాటి విలువకి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలుసుకున్నాం.. ఇప్పుడు జూనియర్ వేసుకున్న డ్రెస్, క్యాప్, వాచ్ అండ్ సన్ గ్లాసెస్ కాస్ట్ గురించి చూద్దాం..
1) డోల్స్ అండ్ గబ్బన వైట్ బ్లాక్ సిసిలీ స్వెట్ షర్ట్ – రూ. 99,000/-