Jr NTR, Mokshagna: తమ్ముడు మోక్షజ్ఞని గట్టిగా హత్తుకున్న ఎన్టీఆర్.. వైరల్ అవుతున్న పిక్!
August 24, 2023 / 06:29 PM IST
|Follow Us
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో అందరికీ తెలుసు. అతని గురించి ఏ వార్త వచ్చినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పర్సనల్ లైఫ్ గురించి రకరకాల వార్తలు వస్తుంటాయి.నారా కుటుంబంతో, అలాగే బాబాయ్ బాలకృష్ణతో ఎన్టీఆర్ కు పడటం లేదని., ఎన్టీఆర్ ని బాలయ్య దూరం పెట్టాడు అంటూ రకరకాల వార్తలు వస్తూ ఉంటాయి. సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ఎన్టీఆర్ వెళ్ళలేదు. అంతకు ముందు తారకరత్న సంతాప సభలో కూడా బాలయ్య, ఎన్టీఆర్ లు.. ఎడమొఖం, పెడమొఖం అన్నట్టు ఉన్నారంటూ సోషల్ మీడియాలో డిస్కషన్లు నడిచాయి.
ఇదిలా ఉంచితే.. తాజాగా ఎన్టీఆర్ .. మోక్షజ్ఞకి డీప్ హగ్ ఇచ్చి వార్తల్లో నిలిచాడు. నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి సుహాసిని కొడుకు అయిన శ్రీ హర్ష.. పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. ఇందులో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఓ రేంజ్ లో హడావిడి చేశారు. అలాగే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ కూడా ఈ వేడుకకు విచ్చేసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను ఆప్యాయంగా పలకరించాడు. ఈ సమయంలో ఎన్టీఆర్ తో సరదాగా ముచ్చటించాడు.
మోక్షజ్ఞతో (Jr NTR) ఎన్టీఆర్.. లు కలిసి మాట్లాడుకున్న వీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. దీంతో బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. మోక్షజ్ఞని .. అన్నకి తగ్గ తమ్ముడు అనిపించుకోవాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు. మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుంటుంది అనే సంగతి తెలిసిందే.