Balakrishna, Jr NTR: బాబాయ్ అబ్బాయ్ కలవడం కష్టమేనా?

  • December 15, 2021 / 03:19 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో వల్ల ఆహా ఓటీటీకి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. మాస్ హీరో అయిన బాలకృష్ణ తనదైన శైలిలో హోస్టింగ్ చేయడంతో పాటు పాపులర్ సెలబ్రిటీలు ఈ షోకు గెస్టులుగా హాజరవుతూ ఉండటంతో అన్ స్టాపబుల్ షోకు ప్రేక్షకాదరణ దక్కుతోంది. బాలయ్య తనలోని ఫన్ యాంగిల్ ను చూపించడంతో పాటు అనేక వివాదాస్పద అంశాల గురించి ఈ షోలో చెబుతున్నారు.

ఈ షో ఐదో ఎపిసోడ్ కు ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గెస్టులుగా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ ఈ షోలో పాల్గొనకపోవడం ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తోంది. కొన్నిరోజుల క్రితం ఎన్టీఆర్ అన్ స్టాపబుల్ షోలో పాల్గొననున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. అదే సమయంలో అఖండ సక్సెస్ మీట్ కు తారక్ రావచ్చని ప్రచారం జరిగింది. ఈ మధ్య కాలంలో బాలయ్య తారక్ కలిసి కనిపించలేదు.

అయితే అఖండ సినిమా రిలీజైన సమయంలో ఎన్టీఆర్ అఖండ గురించి పాజిటివ్ గా పోస్ట్ పెట్టారు. బాలయ్య ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని జరిగిన ప్రచారం నిజమేనని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, బాలయ్య కలిసి కనిపిస్తే మాత్రమే ఈ ప్రచారానికి తెర పడే అవకాశం అయితే ఉంటుంది. బాలయ్య ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus