Unstoppable2: ఆ షోకు తారక్ రావడం బాలయ్యకు ఇష్టం లేదా?

  • October 6, 2022 / 12:15 PM IST

బాలయ్య హోస్ట్ గా అతి త్వరలో ప్రారంభం కానున్న అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ లకు సంబంధించి ఎన్నో పేర్లు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం వరకు అన్ స్టాపబుల్ సీజన్2 గెస్ట్ ల జాబితాలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరు కూడా వినిపించింది. అయితే తారక్ ఈ షోకు రావడం కష్టమేనని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందుకు ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది.

బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం కొంత గ్యాప్ ఉందని సమాచారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు వివాదం సమయంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరు బాలయ్యకు కోపం తెప్పించిందని సమాచారం అందుతోంది. ఈ రీజన్ వల్లే అన్ స్టాపబుల్ సీజన్2 లో పాల్గొనడానికి తారక్ నుంచి ఎలాంటి సమస్య లేకపోయినా బాలయ్యకు ఇష్టం లేకపోవడంతో ఈ షో నిర్వాహకులు సైలెంట్ అయ్యారని తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఈ షోలో పాల్గొంటుండగా సమంత, అనుష్క మరి కొందరు ప్రముఖ హీరోయిన్లు సైతం ఈ షోలో సందడి చేయనున్నారు.

ఫస్ట్ సీజన్ ను మించి ఈ సీజన్ సక్సెస్ సాధించడానికి ఈ షో నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటుండగా ఈ షో ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఆహా ఓటీటీకి ఈ షో ద్వారా సబ్ స్క్రైబర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇతర ఓటీటీలతో పొల్చి చూస్తే ఆహా ఓటీటీ ప్రీమియం తక్కువే అనే సంగతి తెలిసిందే.

స్టార్ హీరో బాలకృష్ణ ఈ షో కోసం భారీ మొత్తంలో ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ సీజన్2 కు చిరంజీవి, నాగార్జున కూడా హాజరయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. అన్ స్టాపబుల్2 కోసం బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus