యంగ్ టైగర్ ఎన్టీఆర్… ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకున్నాడు. దానికి సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి తదితరులు ఉన్నాయి. ఈ ఫోటోల్లో కూడా ఎన్టీఆర్ కుడి చేతికి బ్యాండేజీ ఉంది. ఇటీవల జిమ్ లో వర్కవుట్లు చేస్తున్న సమయంలో ఆయన చేతికి గాయమైనట్టు తెలుస్తుంది. మొన్నటికి మొన్న దీపావళి సందర్భంగా తన అభిమానులకి విషెస్ చెబుతూ ఓ ఫోటోని షేర్ చేసాడు ఎన్టీఆర్.
ఈ ఫోటోల్లో ఆయన ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఆ ఫోటోలో కూడా ఎన్టీఆర్ చేతికి బ్యాండేజ్ ఉంది. ఇక రాంచరణ్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ ఈ మధ్యనే పూర్తయ్యింది. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ‘జనతా గ్యారేజ్’ తర్వాత..
దాదాపు 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత వీరి కాంబోలో చిత్రం రాబోతుంది. అది కూడా పూర్తయ్యాక ‘కె.జి.ఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో ఓ చిత్రం చేస్తున్నట్టు కూడా ఎన్టీఆర్ ప్రకటించాడు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోని మీరు కూడా ఓ లుక్కేయండి :