చరణ్ ఫ్యాన్స్ సరదా తీరిపోయింది. వారి ఊహకు మించిన బిగ్ సర్ప్రైజ్ రాజమౌళి వారికి ఇచ్చారు. రాజమౌళి ఎప్పటిలాగే ఫ్యాన్స్ కి రెట్టింపు ఉత్సాహం పంచారు. సిక్స్ ప్యాక్ బాడీలో చరణ్ మారణాయుధం కంటే షార్ప్ గా కనిపించారు. చరణ్ ఆయుధాలు వాడిన తీరు మరియు కళ్ళలో కసి, కండల్లో పవర్ ఆ పాత్రను ఆకాశానికి ఎత్తేశాయి. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఆ పాత్రను మరింత ఎలివేట్ చేసింది.
ఈ నేపథ్యంలో చరణ్ ఫ్యాన్స్ కి రౌద్రం రణం రుధిరంలో అల్లూరి సీతారామరాజు పాత్ర భీభత్సం సృష్టించడం ఖాయం అని అర్థమైపోయింది. వందకి రెండు వందల శాతం శాటిస్ఫ్యాక్షన్ చరణ్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐతే ఇప్పుడు రాజమౌళి పై బాధ్యత మరింత పెరిగిపోయింది. చరణ్ ఇంట్రడక్షన్ ఆటమ్ బాంబులా పేలిన నేపథ్యంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమ హీరో ఇంట్రో కూడా సునామీలా ఉండాలని కోరుకోవడం ఖాయం.
చరణ్ కి మించిన ఎలివేషన్ ఎన్టీఆర్ కి కావాలని వారు కోరుకోవడం సహజం. కాబట్టి భారీ ఎత్తున ఎన్టీఆర్ చేస్తున్న కొమరం భీమ్ పాత్రను ఎలివేట్ చేయాల్సివుంటుంది. కాబట్టి ఫ్యాన్స్ నుండి రాజమౌళిపై ఈ విషయంలో ఒత్తిడి పెరగడం అనేది జరుగుతుంది. కనుక రాజమౌళి మే 20లోపు ఓ అద్భుతమైన ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సిద్ధం చేయాల్సివుంటుంది. చూద్దాం మరి ఎన్టీఆర్ ని కొమరం భీమ్ గా రాజమౌళి ఎలా పరిచయం చేశాడో. ఇక ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి కానుకగా 2021జనవరి 8న విడుదల కానుంది.