Jr NTR: ఎన్టీఆర్ డెబ్యూ కు 20 ఏళ్ళు.. మొదటి సినిమాకి పారితోషికం ఎంతో తెలుసా?
May 25, 2021 / 03:54 PM IST
|Follow Us
1996 వ సంవత్సరంలో ‘బాల రామాయణం’ తో ఎన్టీఆర్ సినీ రంగప్రవేశం చేసాడు. అయితే అతను పూర్తిస్థాయి హీరోగా పరిచయమైన సినిమా మాత్రం ‘నిన్ను చూడాలని’ అనే చెప్పాలి. 2001వ సంవత్సరం మే 25న ఈ చిత్రం విడుదలయ్యింది. అంటే నేటితో ‘నిన్ను చూడాలని’ విడుదలయ్యి 20 ఏళ్ళు పూర్తి కావస్తోంది. వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.’నువ్వు వస్తావని’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు కావడంతో నిర్మాత రామోజీరావు గారు అతన్ని పిలిచి మరీ ఎన్టీఆర్ ను హీరోగా లాంచ్ చేసే అవకాశాన్ని చేతిలో పెట్టారు.
అయితే ఆ అవకాశాన్ని ప్రతాప్ పూర్తి స్థాయి సద్వినియోగ పరుచుకోవడంలో విఫలమయ్యాడు. అలాగని సినిమా ప్లాప్ కాదు.. సో సోగా ఆడింది. నిజానికి ఎన్టీఆర్ ను లాంచ్ చేసే అవకాశం మొదట రాజమౌళికే వచ్చింది. అయితే ‘స్టూడెంట్ నెంబర్ 1’ సినిమా లేట్ గా మొదలవడంతో.. ఎన్టీఆర్ డెబ్యూ మూవీ డైరెక్ట్ చేసే అవకాశం వి.ఆర్.ప్రతాప్ కు దక్కింది. అయితే ‘నిన్ను చూడాలని’ చిత్రానికి ఎన్టీఆర్ అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.4 లక్షలు. ఆ సినిమా మొదలుపెట్టినప్పుడు ఎన్టీఆర్ వయసు కేవలం 17 సంవత్సరాలు.
అంటే ఆ టైంకి ఓటు హక్కు కూడా ఎన్టీఆర్ కు వచ్చి ఉండదు.ఆ డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక ఆ రూ.4 లక్షలు తీసుకెళ్లి వాళ్ళ అమ్మ చేతిలో పెట్టాడట ఎన్టీఆర్. ఏమైనా రూ.4 లక్షలతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టిన ఎన్టీఆర్.. ఈ 20 ఏళ్ళలో రూ.30 కోట్లు పారితోషికం తీసుకునే రేంజ్ కు వెళ్ళాడు. ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకి గాను ఎన్టీఆర్ పారితోషికం రూ.30 కోట్లని తెలుస్తుంది. దాంతో పాటు అదనంగా షేర్ కూడా ఉందని టాక్.