Jr NTR: బింబిసారా రాజుగా నీకన్నా ఈ పాత్రను ఎవరు భర్తీ చేయలేరు?

  • August 5, 2022 / 04:45 PM IST

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సంయుక్త మీనన్, కేథరిన్ కథానాయకులుగా తెరకెక్కిన చిత్రం బింబిసారా. ఈ సినిమా నేడు ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులు ఊహించిన విధంగానే ప్రేక్షకుల అంచనాలను చేరుకొని అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇలా మొదటి షో నుంచి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడం విశేషం.డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేసింది.

డెబ్యూ డైరెక్టర్ గా వశిష్ట టేకింగ్ చూసిన అభిమానుల సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇలా ఈ సినిమాకి ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతుండగా తాజాగా ఈ సినిమా విజయం పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఈ సినిమాపై స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. బింబిసార సినిమాకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు సినిమాని ఎంతో అనుభూతి చెందుతున్నారు.

మంచి సినిమా వచ్చినప్పుడే ప్రేక్షకులు ఆ సినిమాని ఆస్వాదిస్తూ అనుభూతి చెందుతారు. కళ్యాణ్ రామ్ అన్న బింబిసారా రాజుగా నువ్వు తప్ప ఈ పాత్రను ఎవరు పూర్తి చేయలేరనీ తారక్ ఈ సందర్భంగా ఈ సినిమా గురించి స్పందించారు. అదేవిధంగా డైరెక్టర్ వశిష్ట అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గురించి కూడా మాట్లాడుతూ ఈ సినిమాకి వెన్నెముకగా నిలిచారని చెప్పుకొచ్చారు.

ఇంత మంచి సినిమాని ప్రేక్షకులకు అందించినందుకు చిత్ర బృందానికి సాంకేతిక నిపుణులకు ఎన్టీఆర్ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus