Jr NTR, Lakshmi Pranathi: నేను ఇష్టమని ప్రణతి ఎప్పుడు చెప్పలేదు: ఎన్టీఆర్
December 19, 2023 / 05:58 PM IST
|Follow Us
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గ్లోబల్ స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ఈయన దేవర సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి ఒక ఓల్డ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భాగంగా ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నేను పెళ్లి చూపులకు వెళ్లిన తర్వాత లక్ష్మీ ప్రణతిని చూడగానే నాకు నచ్చిందని చెప్పాను కానీ లక్ష్మీ ప్రణతికి నేను నచ్చానా లేదా అన్న విషయాన్ని మాత్రం ఇప్పటికీ కూడా చెప్పలేదని ఈయన తెలియజేశారు.
నేను పెళ్లి చూపులకు వెళ్లి పెళ్లి ఓకే చేసుకున్న తర్వాత దాదాపు 8 నెలలకు మా పెళ్ళి జరిగింది.ఈ 8 నెలల కాలంలో ఎప్పుడు కూడా ప్రణతి నేనంటే ఇష్టం అనే మాట చెప్పలేదని నేను తనకు నచ్చానని కూడా చెప్పలేదని ఈయన వెల్లడించారు. పెళ్లి జరిగిన తర్వాత కూడా నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకుందా లేక బలవంతంగా పెళ్లి చేశారా అన్న సందేహాలు నాలో ఉండేవని (Jr NTR) ఎన్టీఆర్ తెలిపారు.
ఆడవారు తమ ఇష్టాలను నోటి ద్వారా తెలియ చేయకపోయినా వారు మనతో వ్యవహరించే విధానం బట్టి మనం వారిని అర్థం చేసుకోవాలని ఇలా ఎప్పుడైతే ఒక అమ్మాయి మనసు అర్థం చేసుకుంటారో వారు నిజంగా గ్రేట్ అంటూ ఎన్టీఆర్ ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఎన్టీఆర్ కి పెద్దలు కుదిర్చిన వివాహమైనప్పటికీ వీరిద్దరూ మాత్రం ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. ఇక ఈ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు అనే సంగతి మనకు తెలిసిందే.