యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ప్రశాంత్ నీల్ (Prashanth Neel )కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకున్న సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాల అనంతరం మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను రిలీజ్ చేయగా ఆ పోస్టర్ లో ఈ సినిమా కథకు సంబంధించిన కొన్ని క్లూస్ ఇచ్చారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో డ్రగ్స్ మాఫియా డాన్ గా తారక్ కనిపించనున్నారు.
కౌన్ సా అనే వ్యక్తి జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోందని ఇండియా, చైనా, భూటాన్ దేశాల్లోని కొన్ని ప్రాంతాలను కలుపుకుంటూ ఉండే ప్రాంతాన్ని గోల్డెన్ ట్రయాంగిల్ అని పిలుస్తారని 1969లో జరిగిన కథగా ఈ సినిమాను తెరకెక్కిస్తారని సమాచారం అందుతుండటం గమనార్హం. నాలుగు దేశాలు పట్టుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి పాత్రలో తారక్ కనిపించనున్నారని తెలుస్తోంది.
2026 సంవత్సరం జనవరి నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం తారక్ ఎక్కువ సంఖ్యలో డేట్స్ కేటాయించారని స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే పూర్తైందని భోగట్టా. 2025 ఎండింగ్ వరకు తారక్ డైరీ ఫుల్ అయినట్లేనని తెలుస్తోంది. 2025లో తారక్ కొత్త సినిమాలకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంది.
దేవర (Devara) రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా సెప్టెంబర్ నెలలో ఈ సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయనున్నారని తెలుస్తోంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లైనప్ మాత్రం అదిరిపోయిందని ఎన్ని అంచనాలు పెట్టుకున్నా నిరాశ పరచకుండా కెరీర్ ను తారక్ ప్లాన్ చేసుకుంటున్నారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో జనతా గ్యారేజ్ (Janatha Garage) తర్వాత తారక్ నటిస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.