బాషాని గుర్తుకు తెస్తున్న రజనీకాంత్ “కాలా” ఫస్ట్ లుక్!

  • May 25, 2017 / 01:47 PM IST

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ 161వ చిత్రం ‘కాలా-కరికాలన్‌’ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ రోజు రిలీజ్ అయి ఆకట్టుకుంటోంది. రజనీ అల్లుడు, యువ హీరో ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలిమ్స్‌ సంస్థ ద్వారా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. సాయంత్రం వచ్చిన రజనీ లుక్స్ అలనాటి బ్లాక్ బస్టర్ బాషా సినిమాని గుర్తుకు తెచ్చింది. పైగా బాషాలో “బాషా.. మాణిక్ బాషా” లాగా.. కాలా.. కరి కాలన్ అనే ట్యాగ్ లైన్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

‘కబాలి’లో రజనీని కొత్తగా చూపించిన  పా.రంజిత్‌ ఈ చిత్రంలోనూ సరికొత్తగా చూపించబోతున్నట్లు పోస్టర్లు స్పష్టం చేశాయి. తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన వ్యక్తి ముంబై వెళ్లి అక్కడ పవర్‌ఫుల్‌ డాన్‌గా ఎలా మారాడు అనే ఇతి వృత్తంతో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్న ఇందులో రజనీ సరసన బాలీవుడ్‌ నటి హ్యూమా ఖురేషీ జోడీగానటిస్తున్నారు. సంతోష్‌ నారాయణ సంగీతం సమకూరుస్తున్న ఈ మూవీ 2018లో విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus