టీజర్ తోనే రికార్డులు బద్ధలు కొడుతున్న రాజనీకాంత్!

  • May 3, 2016 / 05:59 AM IST

పా రంజిత్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘కబాలి’. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను ఆదివారం విడుదల చేశారు. ఈ టీజర్ విడుదల చేసిన 10 గంటల్లోనే నాలుగు మిలియన్ వ్యూస్ సంపాదించి.. భారత యూట్యూబ్ రికార్డులన్నీ కూడా బద్దలు కొట్టింది.

మరోవైపు 8 గంటల్లోనే లక్షల లైకులు సంపాదించుకున్న ‘తేరి’ టీజర్ రికార్డును సైతం ‘కబాలి’ టీజర్ బ్రేక్ చేసింది. కేవలం 90 నిమిషాల్లోనే 1.5 లక్షల లైకులను కబాలి టీజర్ సంపాదించుకొంది. 67 సెకండ్ల పాటు ఉన్న ఈ టీజర్ లో రజనీ ఎంతో స్టైలిష్ గా ఉండటంతో పాటు, ‘కబాలి రా’ అంటూ రజనీ చెప్పిన
డైలాగ్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటోంది. కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ చిత్రం మే నెలాఖరు లో కానీ, జూన్ మొదటి వారంలో కానీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus