Kajal: కాజల్ 38వ బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ వైరల్..!

  • June 20, 2023 / 08:16 PM IST

కాజల్ అగర్వాల్ …’లక్ష్మీ కళ్యాణం’ తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈమె.. ‘చందమామ’ చిత్రంతో సక్సెస్ అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ వెంటనే ‘మగధీర’ లో ఛాన్స్ దక్కడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు 13 ఏళ్ళ పాటు కాజల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. ఇంకా రాణిస్తూనే ఉందని చెప్పాలి. 2020 లో కాజల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకుంది.

ఆ తర్వాత ప్రెగ్నన్సీ ధరించి ఓ బిడ్డకు జన్మనివ్వడంతో కొంత సినిమాలను తగ్గించింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతుంది ఈ అమ్మడు. ప్రస్తుతం బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రంతో పాటు ‘సత్యభామ’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా గడుపుతుంది. ఇదిలా ఉండగా.. నిన్న అంటే జూన్ 19 న కాజల్ తన 38 పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకుంది. నిన్న సోషల్ మీడియాలో (Kajal) కాజల్ కి పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు..

అభిమానులు అలాగే నెటిజన్లు. నిన్న ‘సత్యభామ’ మూవీ గ్లింప్స్ ను విడుదల చేయడం కూడా జరిగింది.దీనికి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక తన పుట్టినరోజు వేడుకని కుటుంబ సభ్యులు అలాగే స్నేహితుల మధ్య సెలబ్రేట్ చేసుకుంది కాజల్. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus