బెల్లంకొండ – తేజ టైటిల్ ను లీక్ చేసేసింది..!

  • January 4, 2019 / 01:07 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘సీత’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఇంకా చిత్రబృందం అధికారకంగా ప్రకటించలేదు. అయితే అనుకోకుండా ఈ చిత్ర టైటిల్ ను లీక్ చేసేసింది కాజల్.

ఇటీవల తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన కాజల్ తన కొత్త సినిమా పేరు ‘సీత’ అని చెప్పింది. అయితే .. అందరూ అనుకుంటున్నట్టు ఈ చిత్రం ఫిబ్రవరిలో కాకుండా మార్చిలో విడుదలవుతుందని ప్రకటించేసింది. గతంలో హీరోయిన్ తాప్సి కూడా ప్రభాస్ తో చేసిన ‘మిస్టర్ పర్ఫెక్ట్’ టైటిల్ ను ఇలాగే అనుకోకుండా లీక్ చేసేసింది. అలాగే సమంత కూడా పవన్ కళ్యాణ్ తో నటించిన ‘అత్తారింటికి దారేది’, జూ.ఎన్టీఆర్ తో చేసిన ‘రభస’ చిత్ర టైటిల్స్ ని కూడా లీక్ చేసింది. తాజాగా కాజల్ కూడా అలాంటి పొరపాటునే చేసింది. ఇక ఈ చిత్రంలో కాజల్ నెగెటివ్ రోల్ లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus