Kajal: ఆ టైంలో నా వల్ల నా భర్త కూడా ఇబ్బంది పడ్డాడు.. కాజల్ ఎమోషనల్ కామెంట్స్

  • July 3, 2023 / 09:17 AM IST

‘లక్ష్మీకళ్యాణం’ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్‌ అటు తర్వాత ‘చందమామ’ ‘మగధీర’ చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా కలుపుకుని 50కి పైగా సినిమాల్లో నటించింది. అయితే ఆఫర్లు తగ్గుతున్నాయి అనుకున్న టైంలో 2020లో బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లుని పెళ్లాడింది. ఆ తర్వాత ప్రెగ్నెంట్ అవ్వడంతో కొన్ని సినిమాల్లో ఆఫర్లు వదులుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం బాలకృష్ణ – అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘భగవంత్ కేసరి’ సినిమాలో నటిస్తుంది ఈ బ్యూటీ.

తమిళంలో అయితే ‘ఇండియన్ 2’ ‘సత్యభామ’, ‘ఉమ’ వంటి సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాజల్ – గౌతమ్ దంపతులకి నీల్ కిచ్ లు అనే అబ్బాయి ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాజల్ తన ప్రెగ్నెన్సీ అనుభవాలు తెలుపుతూ కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘నా బిడ్డ పుట్టిన తర్వాత నేను తరచూ డిప్రెషన్‌కి గురయ్యేదాన్ని. అది సర్వసాధారణమైన విషయం. మహిళలు ఎవరైనా డెలివరీ అయ్యాక డిప్రెషన్‌తో బాధపడితే ఫ్యామిలీ అండగా నిలబడాలి.

అలాగే మహిళలు పిల్లలు పుట్టిన తర్వాత తమకంటూ కొంత టైం కేటాయించుకోవాల్సిన అవసరం ఉంది. జిమ్ లో వర్కౌట్స్ , ఇష్టమైన వారితో ఎక్కువగా మాట్లాడటం, ఇలా కొన్ని పనుల ద్వారా డిప్రెషన్ ను జయించొచ్చు. డిప్రెషన్ టైంలో నా వల్ల భర్త గౌతమ్ కిచ్లు చాలా క్లిష్టమైన పరిస్థితులు ఫేస్ చేయాల్సి వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది కాజల్.

స్పై సినిమా రివ్యూ & రేటింగ్!

సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus