క్వీన్ మూవీ రీమేక్ లో కాజల్

  • June 7, 2017 / 08:01 AM IST

మగధీర సినిమాలో యువరాణి మిత్రవిందగా నటించి టాలీవుడ్ క్వీన్ కిరీటాన్ని కాజల్ అగర్వాల్ సొంతం చేసుకున్నారు. అలాగే సర్దార్ గబ్బర్ సింగ్ లోను రాణిగా మెప్పించారు. ఇప్పుడు కోలీవుడ్ లో క్వీన్ గా అవతారం ఎత్తబోతున్నారు. 2014 లో రిలీజ్ అయిన ‘క్వీన్’ మూవీ సంచలనం సృష్టించింది. అందులో లీడ్ రోల్ పోషించిన కంగనా రనౌత్ కి జాతీయ అవార్డు వరించింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు నటుడు, నిర్మాత త్యాగరాజన్ భావించారు. రైట్స్ కొనుక్కొని, తమిళ నేటివిటీకి తగినట్లుగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారు. కంగనా పోషించిన రోల్ కి తమన్నాని కూడా తీసుకున్నారు. త్వరలో సెట్స్ మీదకు వెళ్లా లనుకునేలోపే మిల్కీ బ్యూటీ ట్విస్ట్ ఇచ్చింది.

రెమ్యునరేషన్ ఎక్కువకావాలని డిమాండ్ చేసింది. దీంతో చిత్రబృందం ఆమెను తప్పించి ఆ ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ని తీసుకోవాలని ప్రయత్నాలను మొదలుపెట్టింది. క్వీన్ పాత్రను పోషించడానికి కాజల్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఆమె ఈ ప్రాజక్ట్ పేపర్స్ పై సంతకం చేయగానే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ మూవీతో కోలీవుడ్ లోను కాజల్ క్వీన్ కావడం గ్యారంటీ.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus