స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస ఆఫర్లతో బిజీ అవుతున్నారు. అయితే గత కొన్నిరోజుల నుంచి కాజల్ అగర్వాల్ గర్భవతి అని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ వార్తల గురించి కాజల్ అగర్వాల్ స్పందించకపోవడంతో చాలామంది ఆ వార్తలు నిజమేనని నమ్ముతున్నారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఫేమ్ ఉన్న హీరోయిన్ గా కాజల్ కు పేరుంది.
గతేడాది ప్రముఖ వ్యాపారవేత్తలలో ఒకరైన గౌతమ్ కిచ్లును కాజల్ అగర్వాల్ వివాహం చేసుకున్నారు. ఆ తరువాత కూడా కొన్ని సినిమాలలో నటించిన కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడటం తనకు ఇప్పుడే ఇష్టం లేదని అన్నారు. తల్లి కావడం గురించి తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కాజల్ తెలిపారు. తల్లి అయిన తర్వాత చెల్లి జీవితం ఏ విధంగా మారిందో చూశానని కాజల్ అన్నారు. మాతృత్వం అద్భుతమైన అనుభూతి అని అయితే తల్లి కావాలనే భావన కొన్నిసార్లు తనలో భయాన్ని కలిగిస్తుందని కాజల్ పేర్కొన్నారు.
తనకంటూ ఒక బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారుతుందని కాజల్ అగర్వాల్ వెల్లడించారు. తాను ప్రస్తుతం నటిస్తున్న ఉమ మూవీ ఫీల్ గుడ్ హ్యాపీ ఫ్యామిలీ డ్రామా అని ఈ సినిమాలో తన లుక్ మేరీ పాపిన్స్ ను గుర్తు చేసే విధంగా ఉంటుందని కాజల్ తెలిపారు. ఉమ మూవీ స్టోరీ భిన్నమైన స్టోరీ అని కాజల్ పేర్కొన్నారు.