Kajal: హడావుడి రిలీజ్‌తో కాజల్‌ సినిమా ఇబ్బంది పడుతోందా?

  • March 17, 2023 / 07:29 PM IST

కాజల్‌ కొత్త సినిమా వచ్చేసింది తెలుసా? అదేంటి కాజల్‌ ఎప్పుడు సినిమా చేసింది అనుకుంటున్నారా? గతంలో చేసిన సినిమానేలెండి, ఇప్పుడు రిలీజ్‌ చేశారు. అంతేకాదు తెలుగులో ఈ సినిమ రాలేదు. అయితే త్వరలోనే తెలుగులోకి వస్తుంది అంటున్నారు కాబట్టి.. ఆ సినిమా గురించి తెలిసిన కొన్ని విషయాలు చెబుదామని మా ఆలోచన. సినిమా పేరు ‘ఘోస్టీ’. ఇప్పటికే అర్థమైపోయుంటుంది సినిమా జానర్‌ ఏంటి, కథేంటి అనేది. అవును మీరు అనుకున్నదే హారర్‌ సినిమానే.

తమిళంలో తెరకెక్కిన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం చాలా రోజుల నుండి చెబుతోంది కానీ విడుదల కావడం లేదు. గత ఏడాది ఆఖరున ఓ ట్రైలర్‌ను కూడా రిలీజ్‌ చేశారు. ఇప్పటికి, ఇన్నాళ్లకు సినిమాను రిలీజ్‌ చేసే అవకాశం వచ్చినట్లుంది.. అందుకే సినిమాను తెచ్చేశారు. అయితే చడీ చప్పుడు లేకుండా తీసుకురావడంతో సరైన ఓపెనింగ్స్‌ లేవు అని అంటున్నారు. ఇక సినిమా సంగతి అంటారా? అది కూడా అంతంతమాత్రమే అని చెబుతున్నారు.

అదేంటి? ఇందాకటి నుండి కాజల్‌ సినిమా.. కాజల్‌ సినిమా అంటున్నారు? అనే డౌట్‌ వచ్చిందా? దానికి కూడా కారణముంది. ఎందుకంటే ఈ సినిమాలో హీరో ఎవరూ లేరు. అంతా ఆమెనే. అంటే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమా అన్నట్లు. అంతటి సినిమాను ఎలాంటి ప్రచారం లేకుండా రిలీజ్‌ చేసేశారు. అందులోనూ కాజల్‌కి తెలుగులో క్రేజ్‌ ఉన్నప్పటికీ వాడుకోలేకపోయారు. లేకపోతే మన దగ్గర కూడా ఆ సినిమా వచ్చేది కదా. ఈ సినిమా గుట్టుచప్పుడు కాకుండా రిలీజ్ కావడం వెనుక ఓ కారణం ఉంది అంటున్నారు.

తమిళంలో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలేవీ లేవట. బాక్సాఫీస్ చాలా డల్‌గా ఉండే సీజన్‌ కావడంతో సినిమాల రిలీజ్‌కు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో ఈ టైమ్‌ను వినియోగించుకోవాలని ‘ఘోస్టీ’ టీమ్‌ సినిమాను రిలీజ్‌ చేసేసింది. అయితే ప్రచారం లేని కారణమో ఇంకొకటో కానీ.. సినిమాకు ఓపెనింగ్స్‌ లేవు అంటున్నారు. అలాగే సినిమా ఫలితం కూడా తేడా కొట్టడంతో ప్రచారం చేయకపోవడమే మంచిదైంది అనే విమర్శలూ వస్తున్నాయి.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus