కాజల్ బుగ్గపై ముద్దుపెట్టి అందరిని షాకింగ్ కి గురిచేసిన చోట.కె.నాయుడు

  • November 13, 2018 / 07:34 AM IST

బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మెహ్రిన్ హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ మావిళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’. ఈ సినిమా పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తిచేసుకుంది. ఇక చిత్ర యూనిట్ సినిమా టీజర్ ని సోమవారం విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ 50 కథలు వింటే ఈ కథ బాగా నచ్చి చేసానని, డైరెక్టర్ కి ఇది మొదటి సినిమా అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న డైరెక్టర్ లాగా సినిమా తీసారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో హీరోయిన్ కాజల్ అగర్వాల్ మాట్లాడుతుంటే ఒక అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.

ఇక విషయంలోకి వెళితే, ‘కవచం’ టీజర్ సందర్భంగా హీరోయిన్ కాజల్ అందరి గురించి మాట్లాడుతూ సినిమాటోగ్రాఫర్ చోట.కె.నాయుడు అంటే నాకు చాలా ఇష్టం ఆయనతో కలసి మళ్ళీ పనిచేస్తుండటం ఎంతో సంతోషంగా ఉంది, హి ఇస్ మై ఫెవరెట్ స్మాల్ అని అంటుంటే చోట.కె.నాయుడు వచ్చి కాజల్ బుగ్గ మీద ముద్దు పెట్టడంతో కాజల్ ఒక్కసారిగా షాక్ కి గురై వెంటనే ఛాన్స్ పే డాన్స్ స్మాల్ అంటూ నవ్వేసి ఆయన కూడా మా ఫ్యామిలీ లో ఒక మెంబెర్ లాంటి వాడు అని చెప్పింది. ఏది ఏమైనా సడెన్ గా చోట.కె.నాయుడు ఎంత చనువు ఉంటె మాత్రం స్టేజ్ పైన అలా చేయడం ఏంటి అంటూ కాజల్ అభిమానులు గుస్సు మంటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus