చిరు 152 : మొన్నటివరకూ ఓ కన్ఫ్యూజన్.. ఇప్పుడో కన్ఫ్యూజన్..?

  • March 16, 2020 / 05:35 PM IST

మొన్నటి వరకూ ‘ఆచార్య’.. అదేనండీ ‘మెగాస్టార్ 152’ లో కీలక పాత్రలో మహేష్ బాబు.. కనిపిస్తాడా లేక రాంచరణ్ నటిస్తాడా అనే కన్ఫ్యూజన్ ఏర్పడింది. ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ వల్ల చరణ్ ఈ చిత్రంలో నటించడం కుదరలేదని అందుకే మహేష్ ను తీసుకున్నారని ప్రచారం జరిగింది. అయితే మహేష్ ఎక్కువ పారితోషికం అదుగుతున్నాడని.. దాంతో లేటైనా చరణ్ తోనే ఈ పాత్రని చేయించాలని టీం డిసైడ్ అయినట్టు తెలిసింది. ఇదిలా ఉంటే.. ఇటీవల త్రిష కూడా ఈ ప్రాజెక్ట్ నుండీ తప్పుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చింది.

నిజానికి త్రిష ఈ చిత్రంలో నటిస్తున్నట్టు.. నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించి షాక్ ఇచ్చింది. అయితే ఇప్పుడు చిరు పక్కన ఎవరు హీరోయిన్ గా నటిస్తున్నారు అనేది.. పెద్ద సస్పెన్సు గా మారింది. ఈ విషయం పై చాలా చర్చలు జరుగుతున్నాయి. కాజల్ అని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అనుష్క అంటున్నారు. నిజానికి రెండు మంచి ఛాయిస్ లే..! కాజల్ ఆల్రెడీ ‘ఖైదీ నెంబర్ 150’ లో చిరుకి జోడీగా నటించింది. కానీ అనుష్క మాత్రం చేయలేదు. ‘స్టాలిన్’ లో చిరుతో కలిసి ఓ సాంగ్ లో స్టెప్పులేసింది.. ‘సైరా’ లో గెస్ట్ రోల్ కూడా చేసింది కానీ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేయలేదు. కాబట్టి ఆమెనే బెస్ట్ ఆప్షన్ అని అంతా అంటున్నారు. మరి ఈ విషయం పై నిర్మాతలు ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి..!

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus