Kajal, Anushka: కాజల్ ప్లేస్ లో అనుష్క .. అంత సీక్రెట్ గా ఉంచారా?
April 26, 2022 / 11:14 AM IST
|Follow Us
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆచార్య. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై రాంచరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరించారు. రాంచరణ్ కూడా ఈ మూవీలో సిద్ధ అనే పాత్రలో నటించారు. ఆయన సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 29న ఈ మూవీ విడుదల కానుంది.
చిరు, చరణ్ ల పెర్ఫార్మెన్స్ లను చూడాలని మెగా అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే మొదట ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ ట్రైలర్ లో ఆమె కనిపించలేదు. దీంతో దర్శకుడు కొరటాల శివకు ఈ విషయమై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ విషయం పై స్పందించిన కొరటాల శివ… ఈ మూవీలో కాజల్ ట్రాక్ ను డిలీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆచార్య నక్సలైట్ గా కనిపిస్తున్నాడు కాబట్టి..
అతనికి లవ్ ఇంట్రెస్ట్ ఉంటే బాగోదు అని భావించి నాలుగు రోజులు షూటింగ్ అయ్యాక కాజల్ ను తొలగించినట్లు కొరటాల చెప్పుకొచ్చాడు. అయితే నక్సలైట్ గా కనిపించే చిరు పాత్రకి ఐటెం సాంగ్స్ వంటి వాటిలో చిందులు వేసినట్టు చూపించొచ్చా, అంటూ కొరటాల పై సెటైర్ లు కూడా వినిపించాయి. ఇదిలా ఉంటే.. ఈ మూవీలో కాజల్ ప్లేస్ లో అనుష్క నటించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇది నిజమో కాదో తెలీదు, కాజల్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక ఈ మూవీ నుండీ తప్పుకుంది. దాంతో ఆమె ప్లేస్ లో అనుష్క ని తీసుకుని ఆ పాత్ర చిత్రీకరణ పూర్తి చేసినట్టు భోగట్టా. ఇందులో ఎంత వరకు నిజముందో మరో 3 రోజుల్లో తేలిపోతుంది.