ప్రభాస్ (Prabhas) నటించిన ‘కల్కి 2898 ad ‘(Kalki 2898 AD) .. మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అశ్వినీదత్ (C. Aswani Dutt) దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రియాంక దత్ (Priyanka Dutt), స్వప్న దత్(Swapna Dutt)..లు కూడా సహా నిర్మాతలుగా వ్యవహరించారు. ట్రైలర్స్ లో విజువల్స్ కూడా హైలెట్ గా నిలిచాయి. హాలీవుడ్ సినిమాల స్థాయిలో అవి ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో 3D వెర్షన్ ను కూడా రిలీజ్ చేస్తున్నారు.
‘కల్కి 2898 ad’ టికెట్ల గురించి సోషల్ మీడియాలో ఏ రేంజ్ డిస్కషన్ నడుస్తుందో అందరికీ తెలిసిందే. అంతా బాగానే ఉంది కానీ.. ఇప్పుడు ‘కల్కి..’ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ‘కల్కి 2898 ad ‘ సినిమాని కేవలం 2K వెర్షన్లోనే రిలీజ్ చేస్తున్నారట. ఈరోజుల్లో రీ రిలీజ్ చేస్తున్న సినిమాలను సైతం 4K కి డిజిటలైజ్ చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.
4K కి అప్డేట్ చేయడం వల్ల క్వాలిటీ కూడా బాగుంటుంది. కానీ ఓ రేంజ్లో విజువల్స్ ఎఫెక్ట్స్ కలిగిన కొత్త సినిమా ‘కల్కి 2898 ad ‘ ని 2K వెర్షన్లో రిలీజ్ చేస్తుండటం ఏంటి అంటూ.. కొంతమంది పెదవి విరుస్తున్నారు. బహుశా టైం తక్కువగా ఉండటం వల్ల.. టీం ఈ నిర్ణయం తీసుకుందా? లేక మరేదైనా కారణమా అనేది తెలియాల్సి ఉంది.