Kalyan Dev: వైరల్ అవుతున్న కళ్యాణ్ దేవ్ షాకింగ్ పోస్ట్.. ఏమైందంటే?

  • January 2, 2023 / 04:06 PM IST

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ శ్రీజ భర్తగా తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు సుపరిచితం కాగా కళ్యాణ్ దేవ్ పలు సినిమాలలో హీరోగా కూడా నటించారు. కమర్షియల్ గా ఆ సినిమాలు ఆకట్టుకోలేకపోయినా కళ్యాణ్ దేవ్ కు సినిమా ఆఫర్లు మాత్రం వస్తున్నాయి. శ్రీజ, కళ్యాణ్ దేవ్ మధ్య దూరం పెరిగిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నా అటు మెగా కాంపౌండ్ నుంచి కానీ ఇటు శ్రీజ నుంచి కానీ ఈ వార్తల గురించి స్పష్టత రావడం లేదు.

అయితే తాజాగా కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా మరో షాకింగ్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. కళ్యాణ్ దేవ్ ఆ పోస్ట్ లో 2022 సంవత్సరంలో చాలా నేర్చుకున్నానని పేర్కొన్నారు. ఈ సంవత్సరం సహనంగా ఏ విధంగా ఉండాలో తెలిసొచ్చిందని కళ్యాణ్ దేవ్ అన్నారు. ఎదుగుదల అంటే ఏంటో తెలిసొచ్చిందని కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు. ఛాన్స్ లను అందుకోవడం, రిస్క్ తీసుకోవడం తెలుసుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు.

నా తప్పుల నుంచి ఎన్నో తెలుసుకున్నానని నాతో నేను ఎక్కువగా గడపడం, ఇతరులను క్షమించడం నేర్చుకున్నానని కళ్యాణ్ దేవ్ పేర్కొన్నారు. నన్ను నేను మార్చుకోవడానికి సాయం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు. మీ అందరికీ ప్రేమ ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని ఆయన కామెంట్లు చేశారు. ప్రయత్నించడం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని కళ్యాణ్ దేవ్ చెప్పుకొచ్చారు.

మీ అందరికీ సక్సెస్, సాహసం, ఆనందం, ఆరోగ్యం, ప్రేమ, మీరు కోరుకున్న ప్రతిదీ ఉండాలని కోరుకుంటున్నానని కళ్యాణ్ దేవ్ కామెంట్లు చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ కళ్యాణ్ దేవ్ చేసిన పోస్ట్ కు 9000కు పైగా లైక్స్ వచ్చాయి. కళ్యాణ్ దేవ్ కు కొత్త ఏడాదిలో వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus