Kalyan Ram, Jr NTR: ఎన్టీఆర్ లో నాకు బాగా నచ్చే విషయం అదే : కళ్యాణ్ రామ్

  • July 30, 2022 / 11:48 AM IST

నందమూరి తారక రామారావు గారు తెలుగు సినిమా స్థాయిని పెంచిన సూపర్ స్టార్. ఆయన ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన వారసుల్లో బాలకృష్ణ, ఎన్టీఆర్ లు స్టార్ డం ని సంపాదించుకుని రాణిస్తున్నారు.అప్పుడప్పుడు కళ్యాణ్ రామ్ కూడా మంచి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాడు. ఇతను హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. ఆగస్టు 5న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకాన్ని కలిగించాయి. అందుకే హీరో కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రం ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఈ క్రమంలో తన తమ్ముడు ఎన్టీఆర్‌ గురించి కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… “తారక్‌ కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. వాళ్ల అమ్మ సైడ్… ఉన్న చెల్లెళ్లను కూడా అతను ఎంతో ఆప్యాయంగా చూసుకుంటాడు.

ఈ విషయం చాలా మందికి తెలియదు. వాళ్లకు అన్ని వసతులు కల్పిస్తున్నాడు ఎన్టీఆర్.తనలో అది నాకు బాగా నచ్చింది. నేను కూడా ఫ్యామిలీ అంటే ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిని అని ఎక్కువ మందికి తెలియదు. నాకు జాయింట్ ఫ్యామిలీస్ అంటే చాలా ఇష్టం. ఎన్టీఆర్ కు నాకు మధ్య పర్సనల్స్‌ అంటూ ఏవీ ఉండవు. ఏదైనా బాధ వేస్తే.. బాధేసింది అని చెప్పుకుంటాము అంతే’’ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకొచ్చాడు.

ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. అటు తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తున్నాడు. ఇది అతనికి 30వ సినిమా.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus