Dilraju,Kalyan Ram: కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే భారీ బిజినెస్ చేస్తున్న బింబిసార!

  • July 8, 2022 / 07:43 PM IST

నందమూరి వారసుడిగా కళ్యాణ్ రామ్ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలలో నటుడిగా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే కళ్యాణ్ రామ్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా గుర్తింపు పొందారు. అయితే చాలా కాలం నుంచి కళ్యాణ్ రామ్ వెండితెరపై సందడి చేయలేదు. ఈ క్రమంలోనే కొత్త డైరెక్టర్ వశిస్ట్ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ బింబిసారా అనే సినిమా ద్వారా రాబోతున్నారు.

ఇప్పటికే షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కావడానికి సిద్ధమయ్యింది. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఈ ట్రైలర్ చూస్తుంటే కళ్యాణ్ రామ్ ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద భారీ హిట్ కొడతారని నమ్మకం అందరిలోనూ ఉంది.ఇకపోతే ఈ సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంటున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏకంగా నైజాం హక్కులను భారీ ధరలకు కొనుగోలు చేశారు. దిల్ రాజు ఈ సినిమా నైజాం హక్కులను దక్కించుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. సినిమా పై ఉన్న నమ్మకంతో దిల్ రాజు ఏకంగా నైజాం హక్కులను 5. 60 కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్ నటించిన ఏ సినిమాకి కూడా జరగని బిజినెస్ ఈ సినిమాకి జరగబోతుందని తెలుస్తోంది.

ఇప్పటివరకు కళ్యాణ్ రామ్ నటించిన ఈ ఒక్క సినిమా కూడా 20 కోట్లు బిజినెస్ చేయలేకపోయింది. అయితే బింబిసార మాత్రం అంతకుమించి బిజినెస్ చేసేలా ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నైజాం హక్కులను దిల్ రాజు కొనుక్కోవడం తోనే ఈ సినిమా మార్కెట్ భారీగా పెరిగిపోయింది. ఈ సినిమా ఆగస్ట్ 5వ తేదీ విడుదలకు సిద్ధం కావడంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలు పెట్టనున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus