Bimbisara Movie: ఆ వస్తువుతో బింబిసార మూవీ ముడిపడి ఉందా?

  • June 10, 2022 / 10:11 AM IST

టాలెంట్ ఉన్నా సక్సెస్ కోసం కెరీర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న హీరోలలో కళ్యాణ్ రామ్ ఒకరు. కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా ఆగష్టు నెల 5వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కళ్యాణ్ రామ్ గత సినిమా ఎంత మంచివాడవురా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలవడంతో కళ్యాణ్ రామ్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాలో నటించారు.

తెలుస్తున్న సమాచారం ప్రకారం టైమ్ ట్రావెల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న బింబిసార రెండు వేర్వేరు టైమ్ లైన్లలో సాగుతుందని బోగట్టా. ఓ మ్యాజికల్ అద్దం ఈ సినిమా కథలో కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం అందుతోంది. మాయా అద్దం వల్లే కళ్యాణ్ రామ్ పాత్రకు గతం తెలుస్తుందని సమాచారం. ఒక పాత్రలో కళ్యాణ్ రామ్ మోడ్రన్ యువకుడిగా, మరో పాత్రలో బార్బేరియన్ కింగ్ గా కనిపించనున్నారు. దాదాపుగా 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుందని సమాచారం.

బార్బేరియన్ కింగ్ గా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కళ్యాణ్ రామ్ కనిపించనున్నారు. సంయుక్త మీనన్, వరీనా హుస్సేన్, కేథరీన్ ట్రెసా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బింబిసారతో కళ్యాణ్ రామ్ కు సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.

బింబిసార సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటే ఈ సినిమాకు కొంతమేర ప్లస్ అవుతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే కళ్యాణ్ రామ్ కెరీర్ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus