Kalyan Ram: కళ్యాణ్ రామ్ ఆ తేదీనే నమ్ముకున్నారా?

  • January 22, 2022 / 06:32 AM IST

కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవి, చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఆచార్య సినిమా ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ కావాల్సి ఉన్నా పెరుగుతున్న కరోనా కేసులు, ఏపీలో టికెట్ రేట్ల తగ్గింపు వల్ల ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 1వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆచార్య రిలీజ్ డేట్ కు రాజశేఖర్ హీరోగా జీవిత డైరెక్షన్ లో తెరకెక్కిన శేఖర్ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వస్తున్నాయి.

మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన జోసెఫ్ సినిమాకు ఈ సినిమా రీమేక్ అనే సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 4వ తేదీన కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసార కూడా రిలీజయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. హీరో కళ్యాణ్ రామ్ ఆచార్య స్థానంలో బింబిసారను విడుదల చేయాలని భావిస్తున్నారు. 40 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన బింబిసార రెండు భాగాలుగా తెరకెక్కుతోందని సమాచారం.

బింబిసార పార్ట్1 రిలీజైన తర్వాతే బింబిసార పార్ట్2 రిలీజ్ కానుందని తెలుస్తోంది. మగధీర తరహా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ ఫ్లాష్ బ్యాక్ లో బింబిసారగా కనిపిస్తారని తెలుస్తోంది. అయితే బింబిసార ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫిబ్రవరి 4వ తేదీకి మరో రెండు వారాలే సమయం ఉన్న నేపథ్యంలో కళ్యాణ్ రామ్ రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రమోషన్స్ విషయంలో వేగం పెంచుతారేమో చూడాలి.

నందమూరి హీరోలలో ఈ మధ్య కాలంలో సక్సెస్ లేని హీరో కళ్యాణ్ రామ్ మాత్రమేననే సంగతి తెలిసిందే. మల్లిడి వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. టైమ్ ట్రావెల్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతుండగా కేథరిన్, సంయుక్త మీనన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. బింబిసార సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ కు ప్లస్ అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus