Kalyan Ram, Allu Arjun: బింబిసార రెండు పార్టులట.. కానీ..?

  • June 28, 2021 / 01:14 PM IST

రాజమౌళి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి 1, బాహుబలి2 ఒకదానిని మించి మరొకటి సక్సెస్ సాధించాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో యశ్ హీరోగా తెరకెక్కుతున్న కేజీఎఫ్ సైతం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ ఛాప్టర్ 1 అంచనాలను మించి సక్సెస్ సాధించగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 సైతం కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నట్టు ప్రకటన వెలువడగా కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ నటిస్తున్న బింబిసార సైతం రెండు భాగాలుగా తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుండగా కొత్త దర్శకుడు వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను రెండు భాగాలు చేసే దిశగా డిస్కషన్లు జరుగుతున్నాయని త్వరలో అధికారిక ప్రకటన రావచ్చని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ ఈ సినిమా కోసం మార్కెట్ ను మించి ఖర్చు చేస్తుండటం గమనార్హం. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే పీరియాడికల్ కథలతో మరిన్ని సినిమాలు తెరకెక్కే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేదు.

పటాస్ తర్వాత ఆ స్థాయి హిట్ సాధించాలని కోరుకుంటున్న కళ్యాణ్ రామ్ బింబిసారతో భారీ బ్లాక్ బస్టర్ ను సాధిస్తారేమో చూడాల్సి ఉంది. బింబిసార పార్ట్ 1 హిట్టైతేనే పార్ట్ 2 తెరకెక్కే అవకాశాలు ఉన్నాయి. పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విధంగానే బింబిసార రెండు భాగాలుగా తెరకెక్కనున్నట్టు వార్తలు వస్తుండటంతో బన్నీని కళ్యాణ్ రామ్ ఫాలో అవుతున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus