Kalyan Ram: కెరీర్‌లో ఇన్ని అనౌన్స్‌మెంట్స్‌ ఫస్ట్‌టైమ్‌!

  • July 6, 2021 / 01:33 PM IST

నందమూరి కుటుంబం నుండి వచ్చినా… ఎక్కడ సరైన స్టార్‌ డమ్‌ సంపాదించని హీరోల్లో కల్యాణ్‌ రామ్‌ ఒకరు. ఎప్పుడో కెరీర్‌ ప్రారంభంలో ఒక హిట్‌, మధ్యలో ఒక హిట్‌, ఇటీవల ఒక హిట్‌ అంటూ సాగిపోతోంది జీవితం. అలా అని కళ్యాణ్‌రామ్‌ సినిమాలు ఆపింది లేదు. తన ప్రయత్నం తాను చేస్తూ వెళ్తున్నాడు. అయతే ఈ ఏడాది పుట్టిన రోజునాడు మాత్రం బ్యాక్‌ టు బ్యాక్‌ నాలుగు సినిమాలు అనౌన్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

కళ్యాణ్‌రామ్‌ రీసెంట్‌ సినిమా ‘ఎంతమంచివాడవురా’. ఆ సినిమా బాక్సీఫీసు దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. మరోవైపు చాలా రోజుల నుండి సినిమాల అనౌన్స్‌మెంట్‌ లేదు. అయితే ‘రావన్‌’, ‘బింబిసార’ ప్రాజెక్టులు అనౌన్స్‌ చేసి… ‘కల్యాణ్‌రామ్‌ స్ట్రాంగ్‌ కమ్‌ బ్యాక్‌’ గ్యారెంటీ అని చెప్పకనే చెప్పాడు. ‘బింబిసార’ కాన్సెప్ట్‌ చూసి జనాలు వావ్‌ అన్నారు. రెండు భాగాలు వస్తుందని తెలిసి వై అన్నారు. సోమవారం కళ్యాణ్‌రామ్‌ పుట్టిన రోజు సందర్భంగా మొత్తం ఆయన ఫ్యూచర్‌ లైనప్‌ చెప్పేశారు. కొత్త వివరాల ప్రకారం కళ్యాణ్‌రామ్‌ ఐదు సినిమాలతో బిజీ అయిపోయారు.

కళ్యాణ్‌తో ఆయా సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థలు కొత్త పోస్టర్లతో విషయాన్ని చెప్పేశాయి. వాటి ప్రకారం చూసుకుంటే… కళ్యాణ్‌రామ్‌ తన 19వ సినిమాగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చేస్తున్నారు. దీనికి రాజేంద్రరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. 20వ సినిమాను దిల్‌ రాజు నిర్మాణంలో చేస్తున్నారు. కేవీ గుహన్‌ దర్శకత్వం వహిస్తారు. నవీన్‌ మేడారం దర్శకత్వంలో `డెవిల్‌` చిత్రాన్ని చేస్తున్నారు. ఇది 21వ చిత్రం. దీనిని అభిషేక్‌ పిక్చర్స్ నిర్మిస్తోంది. మహేష్‌ కోనేరు నిర్మాణంలో `ఎన్‌కేఆర్‌ 22` చిత్రం ఉండబోతోంది.

కళ్యాణ్‌ రామ్‌ కెరీర్‌లో చాలావరకు సినిమా తర్వాత సినిమా చేసుకుంటూ వచ్చారు. వరుసగా సినిమాలు అనౌన్స్‌ చేసింది లేదు. కానీ ఇప్పుడు చూస్తే. ఐదు సినిమాలతో లైనప్‌ ప్రకటించారు. ఒక్కసారిగా కళ్యాణ్‌రామ్‌లో ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందా అని అభిమానులు ఆలోచిస్తున్నారు. ఏదైతేముంది… కళ్యాణ్‌రామ్‌ మళ్లీ (తొలిసారేమో) బిజీ అవుతున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus