Kalyan Ram: బాలయ్య సాధించాడు.. కళ్యాణ్ రామ్ సాధిస్తాడా?

  • February 4, 2023 / 12:08 AM IST

స్టార్ హీరో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి మూవీ 2023 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా టైటిల్ లాంఛ్ కర్నూలులో జరిగిందంటే సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సన్నివేశాల షూటింగ్ కర్నూలులో జరిగింది. అయితే కళ్యాణ్ రామ్ కూడా కర్నూలు సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. కర్నూలులోని ప్రముఖ థియేటర్ లో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ జరిగింది. కళ్యాణ్ రామ్ కు కూడా కర్నూలు సెంటిమెంట్ అచ్చొస్తుందని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

కర్నూలు సెంటిమెంట్ వల్ల బాలయ్యకు ఎన్నో విజయాలు దక్కగా కళ్యాణ్ రామ్ కు కూడా విజయాలు దక్కుతాయేమో చూడాల్సి ఉంది. అమిగోస్ సినిమా ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అమిగోస్ ట్రైలర్ కు గంటలో 5 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అమిగోస్ ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చడంతో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ నెల 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. కళ్యాణ్ రామ్, అషికా రంగనాథ్ జోడీకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడుతున్నాయి. నటుడిగా కళ్యాణ్ రామ్ భిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ ను కొనసాగిస్తున్నారు. కళ్యాణ్ రామ్ నందమూరి హీరోలతో కలిసి మరిన్ని సినిమాలలో నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్ మార్కెట్ పెరగగా అమిగోస్ ఆ మార్కెట్ ను మరింత పెంచుతుందేమో చూడాలి. కళ్యాణ్ రామ్ మాత్రం ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. వరుస విజయాలతో జోరుమీదున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ సినిమాతో మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాలి.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus