Bimbisara Movie: కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా సినిమా!

  • May 28, 2021 / 12:44 PM IST

సరైన హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లు హీరో కళ్యాణ్ రామ్. అతడు చివరిగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా కూడా ప్లాప్ అవ్వడంతో కొత్త సినిమా మొదలుపెట్టడానికి చాలా సమయం తీసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో రాజేంద్ర అనే కొత్త దర్శకుడితో కొన్ని నెలల క్రితం ఓ సినిమాలు మొదలుపెట్టాడు. అయితే నిన్న ఉన్నట్లుండి తన కొత్త సినిమాను ప్రకటించాడు కళ్యాణ్ రామ్.

వశిష్ట్ అనే కొత్త దర్శకుడు రూపొందిస్తోన్న ఈ సినిమా ప్రీ లుక్ ను నిన్న విడుదల చేయగా.. తాజాగా సినిమా టైటిల్ ను రివీల్ చేస్తూ చిన్నపాటి టీజర్ ను వదిలారు. టీజర్ లో కళ్యాణ్ రామ్ సింహం బొమ్మతో ఉన్న కవచం ధరించి, కత్తి చేత పట్టుకొని కూర్చొని ఉండగా.. అతడి కాళ్ల దగ్గర పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి శవాలుగా పడి ఉన్న సైనికులు ఉన్నారు. ఈ టీజర్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు.

ఈ సినిమాకి ‘బింబిసార’ అనే పవర్ ఫుల్ రాజు పేరుని టైటిల్ గా పెట్టారు. టీజర్ ను బట్టి ఇదొక భారీ బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ కలుగుతుంది. అయితే చాలా మంది విజువల్స్ చూసి ‘మగధీర’, ‘బాహుబలి’ని మిక్స్ చేసినట్లు ఉందనే కామెంట్స్ చేస్తున్నారు. అలానే ఈ సినిమా జాకీ చాన్ నటించిన ‘ది మిత్’ అనే సినిమాకి రిఫరెన్స్ లా ఉందంటూ మరికొందరు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కాన్సెప్ట్ ను బట్టి ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనిపిస్తుంది.

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus