రేణు ని లాంచ్ చేస్తున్న కళ్యాణ్..!

  • December 27, 2018 / 01:17 PM IST

టాలీవుడ్ లో కేవలం రెండే.. రెండు చిత్రాలలో నటించింది రేణు దేశాయ్. అందులో ఒకటి ‘బద్రి’ కాగా మరొకటి ‘జానీ’. రెండు చిత్రాల్లోనూ తన మాజీ భర్త పవర్ స్టార్ పవన్ కల్యాణే హీరో కావడం విశేషం. ఇక ఏ తెలుగు చిత్రంలోనూ నటించకపోయినా పవన్ కళ్యాణ్ తో సహజీవనం, తరువాత పెళ్ళి చేసుకోవడం వంటి విషయాలతో పాపులర్ అయ్యింది. అయితే తరువాత పవన్ కళ్యాణ్ తో విడిపోవడం వంటి అంశాలు కూడా చేసుకున్న సంగతి తెలిసిందే.

సినిమాలకు దూరమైనప్పటికీ… పవన్ కు కాస్ట్యూమ్ డిజినర్ గా ‘ఖుషి’ ‘జానీ’ ‘గుడుంబా శంకర్’ ‘బాలు’ ‘అన్నవరం’ చిత్రాలకు పని చేసింది. పవన్ కు దూరమైన తరువాత ‘ఇష్క్ వాలా లవ్’ అనే మరాఠీ చిత్రాన్ని స్వయంగా తనే తెరకెక్కించింది. ఈ చిత్రానికి నిర్మాతగాను అలాగే దర్శకురాలు గాను వ్యవహరించింది రేణు. తాజా తాను మరో వివాహం చేసుకొని.. సెటిల్ అవ్వాలని చూస్తున్నట్టు స్వయంగా రేణునే చెప్పింది. ఇక తాజాగా రేణు ఓ యాడ్ లో నటించడానికి అంగీకరించింది. కళామందిర్ కళ్యాణ్ ‘కాంచీపురం వరమహలక్ష్మి సిల్క్స్’ కి రేణుదేశాయ్ ని బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసుకొని ఆమెతో ఇటీవల ఓ యాడ్ ఫిల్మ్ ని చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus