మెగా హీరోతో రొమాన్స్ చేయనున్న హలో బ్యూటీ!

  • June 16, 2018 / 06:05 AM IST

మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజిల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ తొలి సినిమాతోనే తెలుగువారి మనసులు గెలుచుకుంది. హలో సినిమాలో అక్కినేని అఖిల్ కి జోడిగా నటించి అందరితో అభినందనలు అందుకుంది. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. ఒకటి లవర్ బాయ్ కాగా.. మరొకటి మిడిల్ ఏజ్ క్యారెక్టర్. 40 ఏళ్ల శర్వానంద్ పక్కన జోడీగా కాజల్ అగర్వాల్ ని తీసుకున్నారు. అలాగే రెండో హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శి సెలక్ట్ అయింది. 1980 నాటి పిల్లగా ఆకట్టుకోనుంది. ఇప్పుడు మరో మెగా ఛాన్స్ అందుకుంది.

ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్  “తేజ్ ఐ లవ్ యు” సినిమా చేస్తున్నారు. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. ఇందులో అనుపమని ప్రధాన హీరోయిన్ గా తీసుకున్నారు. రెండో హీరోయిన్ గా కల్యాణి ప్రియదర్శన్ సెలక్ట్ అయింది. కిషోర్ తిరుమల చెప్పిన కథ, అందులో తన పాత్ర బాగుండడంతో ఈ చిత్రానికి కల్యాణి సైన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా హిట్ అయితే కళ్యాణి మెగా హీరోలతో మరిన్ని సినిమాలు చేయడం గ్యారంటీ అని సినీ విశ్లేషకులు వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus